తెలంగాణలో ఓవైపు రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతున్న వేళ టీకాంగ్రెస్ నేతలకు గట్టి షాక్ తగిలింది. ప్రస్తుతం తెలంగాణ మీదుగా సాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో తెలంగాణ కాంగ్రెస్ మునిగితేలుతున్న తరుణంలో ఢిల్లీ నుంచి ఈ షాకింగ్ న్యూస్ నేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన ఏఐసీసీ స్టీరింగ్ కమిటీలో ఒక్క తెలుగు నేతకు చోటు దక్కలేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలెవరూ చోటు దక్కించుకోలేకపోయారు.
పార్టీ నిర్ణయాధికారంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి పాత్ర లేదని దీన్నిబట్టి తెలుస్తోంది. కొత్తగా ఎన్నికైన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రకటించిన 47 మంది పేర్లలో టి సుబ్బరామి రెడ్డి మాత్రమే తెలుగువాడు.
ఏఐసీసీ శాశ్వత ఆహ్వానితుడు కావడం వల్లే ఆయన అత్యంత కీలకమైన సంఘంలో ఉన్నారు. అయితే ఈ రోజుల్లో సుబ్బరామిరెడ్డి కూడా రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా లేరు.
గత స్టీరింగ్ కమిటీలో తెలంగాణ నుంచి నలుగురు సభ్యులున్నారు. వారు కె కేశవ రావు, ఎస్ జైపాల్ రెడ్డి, ఎఐటియుసి చీఫ్ సంజీవ రెడ్డి , జి వెంకట్ స్వామి. వీరిలో కేకే ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉండగా, జైపాల్‌రెడ్డి, వెంకట్‌స్వామి మరణించారు.. సంజీవ రెడ్డికి 90 ఏళ్లు. ప్రస్తుత స్టీరింగ్ కమిటీలో తెలంగాణ నుంచి ఎవరూ లేరు. ఇది తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాకిచ్చింది.
గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, మల్లు భట్టి విక్రమార్క, వీ హనుమంతరావు వంటి సీనియర్ నేతలను స్టీరింగ్ కమిటీలో విస్మరించారు. కాంగ్రెస్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రాధాన్యత లేదని దీన్ని బట్టి క్లియర్ కట్ గా అర్థమవుతోంది. దాదాపు 10 ఏళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారంలో లేని పార్టీ, తెలంగాణలో కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ, ఏపీలో 1 శాతం కంటే తక్కువ ఓట్లను సాధించింది. అందుకే ఆశలు లేని తెలంగాణ, ఏపీ నుంచి ఒక్క నేతకు జాతీయ పార్టీలో పదవులు ఇవ్వలేదని తెలుస్తోంది.
తెలంగాణలో అవకాశాలు ఉన్నా కూడా ఇవ్వకపోవడం వెనుక ఇక్కడి నేతల మధ్య అసమ్మతి కారణం అని తెలుస్తోంది. అసమ్మతి వల్లే తెలంగాణ నేతలకు పదవులు కట్టబెట్టలేదని సమాచారం. రేవంత్ రెడ్డిపై సీనియర్ల తిరుగుబాటు నేపథ్యంలోనే అందరినీ పక్కనపెట్టి షాకిచ్చినట్టు ప్రచారం సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.