జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ పై కొత్త చర్చలు ప్రారంభం అయ్యాయి. ప్రశ్నించేందుకే జనసేన పార్టీని స్థాపించానని చెప్పిన పవర్ స్టార్ పవన్ తెలుగు ప్రజల తరఫున ఇటీవల కొత్త స్టేట్ మెంట్ ఒకటి ఇచ్చారు. స్థానిక బోధనలో భాగంగా తెలుగు భాషను నిషేధించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆ రాష్ర్టంలోని పాఠశాలలకు హుకుం జారీచేశారు. ఈ నిర్ణయం తెలుగు రాష్ర్టాల్లో - తెలుగు ప్రజల్లో చర్చనీయాంశం కాగా....తమిళనాడులో తెలుగుభాషను నిషేధించడాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ నెల చివరలో దీక్ష చేస్తా అని పవన్ ప్రకటించారు. అయితే సెప్టెంబర్ నెల ముగుస్తున్నప్పటికీ జనసేన అధినేత పవన్ ఎక్కడ? తన ప్రకటనలకు ఇచ్చే ట్విట్టర్ వేదికగా కూడా ఆయనెందుకు స్పందించడం లేదు అనే ఆసక్తికర చర్చ సాగుతోంది.
నిర్బంధ తమిళ భాషా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో తెలుగువారంతా హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని పవర్ స్టార్ దీక్ష రూపంలో ఎండగట్టడం అభినందనీయమని ప్రశంసలు కూడా వచ్చాయి. సెప్టెంబర్ నెల చివరిలో అని ప్రకటించిన పవన్ నెల ముగిసిపోతున్నప్పటికీ ఇప్పటివరకు అధికారికంగా తన దీక్ష అప్ డేట్ ను ప్రకటించలేదు. దీక్ష విరమించుకున్నానని లేదా...మరో తేదీకి వాయిదావేశానని కూడా పవన్ లేదా ఆయన తరఫు ప్రతినిధులు ఎవరూ తెలపలేదు. దీంతో ఇంతకూ పవన్ దీక్ష ఉంటుందా? ఉండదా? ఆయన వెనక్కుతగ్గారా లేదా సినిమాల బిజీలో పడ్డారా అనే డిబేట్లు జోరుగా సాగుతున్నాయి.