‘‘అల్లుడుగారికి’’ క్లీన్ చిట్ ఇవ్వలేదంటే..?

Update: 2016-01-28 06:35 GMT
అల్లుడుగారి వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. యూపీఏ హయాంలో అల్లుడుగారి హవాకు పలు రాష్ట్రాల్లో ఆయనపై అవినీతి ఆరోపణలు రావటం తెలిసిందే. దేశాన్ని రిమోట్ కంట్రోల్ లో కంట్రోల్ చేసిన సోనియమ్మ అల్లుడు రాబర్ట్ వాద్రాపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. పలు రాష్ట్రాల్లో అక్రమ భూకొనుగోళ్లకు పాల్పడటం.. లాంటివి ఉన్నాయి. అలాంటి వాటిల్లో రాజస్థాన్ లోనూ వాద్రాపై కేసులు ఉన్నాయి.

నకిలీ పేర్లతో భూములు కొన్న కేసుకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు జరుగుతోంది. ఈ ఉదంతలో ఫస్ట్ పార్టీగా ఉన్న 18 మందిని అరెస్ట్ చేశారు. ఇదే కేసులో రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీలు థర్డ్.. ఫోర్త్ పార్టీలుగా ఉన్నాయి. ఇదే విషయాన్ని తాజాగా రాజస్థాన్ మంత్రి గులాబ్ చంద్ కటారియా ప్రస్తావిస్తూ.. తాము రాబర్ట్ వాద్రాకు క్లీన్ చిట్ ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. క్లీన్ చిట్ ఇవ్వలేదంటూనే.. ఈ కేసులో ఫస్ట్ పార్టీగా ఉన్న 18 మందిని అరెస్ట్ చేశామని వ్యాఖ్యానించారు. అక్కడితో వదలకుండా.. దర్యాప్తులో తేలే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. వ్యాఖ్యలు రోటీన్ గా ఉన్నప్పటికీ.. మంత్రిగారి నోటి నుంచి ప్రత్యేకంగా రావటంతో.. దీని వెనుకున్న మర్మాన్ని అర్థం చేసుకోవటానికి ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కిందామీదా పడుతున్నారు.
Tags:    

Similar News