బాబు సొంత ఊరిలో జీరో డిజిట‌ల్ లావాదేవీలు

Update: 2017-01-05 15:53 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని తిరుపతిలో 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు జ‌రుగుతున్న సంద‌ర్భంగా ఏపీ  ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌రువు పోయే వార్త ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. బాబు సొంత ఊరిలో క‌నీసం ఏటీఎం కూడా లేద‌ని మీడియా ప్ర‌ముఖంగా ప్ర‌చురించింది. పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం ప‌రిణామాలు - న‌గ‌దు ర‌హిత లావాదేవీలపై చంద్ర‌బాబు సార‌థ్యంలో క‌మిటీ ఏర్పాటైన సంగ‌తి తెలిసిందే. దీనికి ర‌థ‌సార‌థిగా ఉన్న బాబు ఊరిలో డిజిట‌ల్ లావాదేవీల జాడ లేనేలేద‌ని మీడియా ప్ర‌ముఖంగా ప్ర‌చురించింది.

టెక్నాల‌జీని అందిపుచ్చుకోవ‌డం - మార్పుకు సిద్ధ‌ప‌డ‌తార‌ని భావించిన నేప‌థ్యంలో బాబు సార‌థ్యంలో డిజిట‌ల్ క‌మిటీని ఏర్పాటు చేశారు. అదే స‌మ‌యంలో ఏపీ ప‌ర్స్ పేరుతో వినూత్న రీతిలో యాప్‌ ను తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అలాంటి చంద్ర‌బాబు స్వ‌గ్రామంలో ఏటీఎం లేక‌పోవ‌డంతో కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి చంద్రగిరి లేదా తిరుపతిలో పనిచేసే ఏటీఎంల కోసం తిరుగుతున్నారని మీడియా దుమ్మెత్తి పోసింది. ఏపీని కూడా డిజిటల్ వైపు న‌డిపిస్తున్నాన‌ని ప్ర‌క‌టిస్తున్న సీఎం చంద్రబాబు త‌న‌ సొంత గ్రామమైన నారావారిపల్లెలో కనీసం బ్యాంకు కార్యాలయం లేదా ఏటీఎం ఏర్పాటు చేసుకోలేక‌పోయార‌ని మీడియా త‌ప్పుప‌ట్టింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News