కువైట్ మరో సంచలనం.. ఇక ప్రవాసులకు అక్కడ నో ఎంట్రీ!

Update: 2022-08-28 04:30 GMT
గల్ఫ్ దేశం  కువైట్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇది ప్రవాసుల పాలిట శాపమవుతోంది. గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న కువైట్ మరో సంచలనానికి తెరతీసింది. ఉపాధి అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇస్తున్న కువైట్ నెమ్మదిగా వలసదారుల ప్రభావాన్ని తగ్గిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగంలో కేవలం కువైటీలకు మాత్రమే పరిమితం చేసింది. విదేశీయులకు ప్రభుత్వ సంస్థల్లో అసలు ఉద్యోగాలు లేకుండా చేసింది.

ఇక ప్రైవేటు రంగంలో కూడా ప్రవాసులకు ఉపాది అవకాశాలను తగ్గిస్తోంది.  గడిచిన ఐదేళ్ల నుంచి అమలు చేస్తున్న కువైటైజేషన్ పాలసీ ద్వారా ఇలా వలసదారుల ప్రాబల్యాన్ని తగ్గించే పనిలో ఉంది.

తాజాగా ఆ దేశ ఆరోగ్యశాఖ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం కువైటీలకు మాత్రమే చికిత్సలు చేయాలని.. ప్రవాసులను ప్రైవేట్ హాస్పిటల్స్ కు పరిమితం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ఇప్పటికే హెల్త్ మినిస్ట్రీ వలసదారులను ప్రభుత్వ ఆస్పత్రులు, క్లినిక్ లకు బదులుగా ధామన్ లోని హెల్త్ హాస్పిటల్ కంపెనీకి తరలిస్తున్నట్లు సమాచారం.

ఇక వచ్చే ఏడాది నుంచి ప్రైవేట్ సెక్టార్ లోని కార్మికులందరినీ పూర్తిగా ధామన్ సెంటర్ కే పరిమితం చేయాలని కువైట్ నిర్ణయించినట్టు తెలిసింది. ప్రభుత్వ సెక్టార్ లో పనిచేస్తున్న ప్రవాసులకు మాత్రం కొంతకాలం మినహాయింపు ఇవ్వనుందట.. ఆ తర్వాత వారిని కూడా ప్రైవేట్ క్లినిక్స్ కు పంపించే యోచనలో అక్కడి మీడియా ఉన్నట్టు సమాచారం.

ఇప్పటికే జబేర్ ఆస్పత్రిలో కేవలం కువైటీలకే పరిమితం చేసింది. వలసదారులకు ఇందులో చికిత్సలు జరగడం లేదు. అలాగే న్యూ జహ్రా హాస్పిటల్, న్యూ ఫర్వానియా హాస్పిటల్లో కూడా ఇదే నియమాన్ని అనుసరించాలని మంత్రిత్వశాఖ భావిస్తోందట.. ఆ తర్వాత దశలో దీన్ని వివిధ ఆస్పత్రులకు విస్తరించే యోచనలో ఉంటారు.

కాగా ప్రస్తుతానికైతే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రవాసులకు సంబంధించిన ఎమర్జెన్సీ కేసులకు మాత్రం చికిత్స చేయనున్నారు. తీవ్ర అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు, అత్యవసర వైద్య సేవలు కావాల్సిన వారికి మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తారట..
Tags:    

Similar News