పోసాని లాంటి ఫైర్ బ్రాండ్లు పవన్ కు ఎందుకు ఉండరు?

Update: 2021-09-28 07:30 GMT
ఏ మాటకు ఆ మాట చెప్పాలి.. వెనుకా ముందు చూసుకోకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడటానికి చాలా దమ్ము ఉండాలి. కింద పడినా తమదే పైచేయి అన్నట్లుగా వ్యవహరించటం మామూలు విషయం కాదు. పవన్ వర్సెస్ వైసీపీ నేతల ఎపిసోడ్ లోకి సినీ నటులు వచ్చేశారు. తాజాగా పవన్ పై పోసాని ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో తెలిసిందే. ఆయన వినిపించిన వాదనలకు సంబంధించి సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నా.. తమకు కూడా పోసాని మాదిరి ఒక బలమైన వాయిస్ లేదే? అన్న వేదనను వ్యక్తం చేస్తున్నారు.

ఇవాల్టి రోజున విలువల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు. మనం అభిమానించే వారి తరఫున.. మనం ఎంతలా మద్దతు ఇస్తామన్న విషయాన్ని జనాలకు చెప్పటానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సందర్భంగా తాము మాట్లాడే మాటల్లో లాజిక్ ఉందా? లేదా? తమ మాటలకు అల్రెడీ సమాధానాలు సోషల్ మీడియాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా.. వాటిని పట్టించుకోకుండా మాట్లాడటం అందరికి సాధ్యమయ్యే విద్య కాదంటున్నారు.

దిల్ రాజుకు కులం పైత్యం అంటకట్టిన వ్యక్తిగా పవన్ నుఏకేసిన పోసాని తీరు చూస్తేనే అసలు విషయం ఇట్టే అర్థమైపోతుందన్నారు. తాను అనాల్సిన మాటను.. తన ఎదురుగా ఉన్న వ్యక్తిని ఉద్దేశించి.. నేరుగా అనేయటం.. మీరు రెడ్డి.. ఆయన రెడ్డి.. మీరేమైనా చెబితే ఆయన కాస్త వింటారేమో? కాస్త చూడండి.. అన్న మాటకు.. కులాన్ని అంటకట్టినట్లుగా స్టేట్ ఇవ్వటానికి పొంతనే లేదు. ఆ మాటకు వస్తే.. తాను కులాలకు అతీతమని మొదట్నించి పవన్ చెబుతున్నా... ఆయనకు కులాన్ని అంటగట్టిన వైనాన్ని పోసాని ఎందుకు ప్రస్తావించరు? అని ప్రశ్నిస్తున్నారు.

సీఎం జగన్ కు కమిట్ మెంట్ తో కూడిన పోసాని లాంటి వాళ్లు తమ పిడి వాదనను బలంగా వినిపిస్తారని.. బ్యాడ్ లక్ ఏమంటే.. పవన్ తరఫున అలా మాట్లాడే వారు ఎవరూ లేరని చెబుతారు.
మనం ఎంత నిజాలు మాట్లాడినా..దానికి తగ్గ వాదనను ప్రజలకు వినిపించాల్సిన అవసరం ఉందని.. కానీ అలాంటిదేమీ పవన్ తరఫున చేయరన్న మాట వినిపిస్తోంది. జగన్ తరఫున అన్ని కులాల వారు ఉన్నారన్న పోసాని.. పవన్ తరఫున పని చేసే వారిలో అన్ని కులాల వారు ఉన్నారన్న విషయాన్ని ఎలా మరుస్తారు. నిజానికి పవన్ కు కులపిచ్చి ఉందనే అనుకుంటే.. ఆయన తాజాగా చేస్తున్న భీమ్లా నాయక్ దర్శకుడు రెడ్డి అన్న విషయాన్ని పవనే స్వయంగా చెప్పారు కదా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు.
Tags:    

Similar News