తెలంగాణలో ఇక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతుందని కలలోనే భావించాల్సి ఉంటుంది. కనీసం ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తవుతుందని చెప్పలేని పరిస్థితి. ఇందుకు కారణం ప్రాజెక్టులకు 15 శాతానికి మించి నిధులు ఇవ్వలేమని ఆర్థిక శాఖ తేల్చి చెబుతుండడమే.
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కేవలం 14 నెలల్లోనే రూ.1300 కోట్లు ఖర్చు చేసి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసింది. మరో ఆరు నెలల్లో దీనిని పూర్తి స్థాయిలో పూర్తిచేసి రాయలసీమకు నీళ్లు ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి.. తెలంగాణ ప్రభుత్వం నీటి విడుదలకు ఇబ్బందులు పెట్టినా కృష్ణా డెల్టాకు ఎటువంటి ఇబ్బందులు రావు. రెండోది.. రాయలసీమకు కృష్ణా జలాలు వస్తాయి. దాంతో రాయలసీమ భూములు సస్యశ్యామలం అవుతాయి. ఏపీలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే చంద్రబాబు నాయుడు పట్టిసీమఃను పూర్తి చేసినా.. తెలంగాణలో కేసీఆర్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఉన్న ప్రాజెక్టులను గందరగోళం చేస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల పేరిట మరింత గందరగోళం సృష్టిస్తున్నారు. ఆయా ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కాని పరిస్థితి కల్పిస్తున్నారు. అంతేనా.. ఇప్పుడు తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు ఏడాదికి 15 శాతానికి మించి ఇవ్వలేమని ఆర్థిక శాఖ స్పష్టం చేస్తోంది. వాస్తవానికి ఈ నిధులు జీతాలకు కూడా సరిపోవు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ముందు నిధులను ఇలా కేటాయించడం వల్లే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. దాంతో తెలంగాణలో ఇక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావడం కలేనని చెబుతున్నారు.