కోట్లాది మంది ప్రజలు ఎంతో టెన్షన్ గా ఎదురుచూస్తున్న వేళ.. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న అమ్మ ఆరోగ్యంపై చోటు చేసుకుంటున్న పరిణామాలు కొత్త కొత్త వార్తలుగా మారుతున్నాయి. దాదాపు 26 రోజుల కిందట.. ఓ అర్థరాత్రి అమ్మకు హైఫీవర్ అంటూ హుటాహుటిన చెన్నై అపోలోకు తరలించటం.. ఆమెకు వైద్యం చేయటం కోసం ఆసుపత్రిలోకి తీసుకెళ్లిన వైద్యులు.. ఇంతకాలం గడిచినా.. ఆమె ఎలా ఉందన్న విషయాన్ని బయట ప్రపంచానికి చూపిస్తున్నది లేదు. అంతేనా.. కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ మొదలు.. బీజేపీ ముఖ్యనేతలు వచ్చినా ఆమె దర్శనం మాత్రం కాలేదు.
ఇన్ ఫెక్షన్ కారణంగా ఆమెను చూసేందుకు వైద్యులు అనుమతించటం లేదని చెబుతున్న ప్రముఖులు.. ఆమె కోలుకుంటున్న విషయాన్ని మాత్రం చెబుతున్నారు. ఇలాంటి వార్తలు అమ్మ కోసం తెగ ఆరాటపడే కోట్లాది మందిలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చే పరిస్థితి. అమ్మ ఆరోగ్యం కోసం.. వైద్యులు సైతం వందలాదిగా ప్రత్యేక యాగాలు చేస్తున్న పరిస్థితి తమిళనాడట చోటు చేసుకుంది. ఇలాంటి సందర్భంలో.. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్లను ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కానీ.. గడిచిన వారం రోజులుగా ఆమె ఆరోగ్యానికి సంబంధించిన అప్ డేట్ అధికారికంగా వెలువడింది లేదు. గత వారంలోనే ఆమె ఆరోగ్యం మెరుగు అవుతుందని.. ఆమె పేపర్లు చదువుతున్నారని.. కొద్ది కొద్దిగా మాట్లాడుతున్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నా.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ ఆసుపత్రి వర్గాల నుంచి బయటకు రాకపోవటం గమనార్హం. ఒక ప్రముఖ వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన వివరాల్ని గుట్టుగా ఉంచటం తప్పు కాదు. అలా అని ఎలాంటి వివరాలు వెల్లడించకుండా రోజుల తరబడి ఉండటం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి గుట్టు కారణంగా.. లేనిపోని అపోహల్ని వ్యాపింపచేసే అవకాశం ఉంది. ఈ వాదనకు బలం చేకూరుస్తూ గడిచిన మూడు వారాల్లో ఇలాంటి వదంతుల్ని వ్యాపిస్తున్నారన్న ఆరోపణలతో దాదాపు 50 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు వీలుగా.. రోజుకు ఒకసారైనా హెల్త్ బులెటిన్లను విడుదల చేయాలన్న అభిప్రాయం సర్వత్ర వ్యక్తమవుతోంది. మరి.. తమిళనాడు ప్రభుత్వం కానీ.. అపోలో ఆసుపత్రి వర్గాలు ఎందుకు కామ్ గా ఉంటున్నట్లు..? కామ్ గా ఉంటూ కోట్లాది మందికి టెన్షన్ పెట్టటం ఎంతవరకు సబబు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/