ఇవాంకాకు ఇచ్చే విందులో లిక్క‌ర్ ఉంటుందా?

Update: 2017-11-19 04:38 GMT
అమెరికా అధ్య‌క్షుడి కుమార్తె ఇవాంకా హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి రావటానికి మ‌రో తొమ్మిది రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ నెల 28 నుంచి 30 వ‌ర‌కు జ‌రిగే అంత‌ర్జాతీయ బిజినెస్ స‌మ్మిట్ లో హాజ‌ర‌య్యేందుకు వివిధ దేశాల నుంచి పారిశ్రామిక ప్ర‌ముఖుల‌తో పాటు.. అమెరికా అధ్య‌క్షుడి కుమార్తె ఇవాంకా రావ‌టంతో ఈ కార్య‌క్ర‌మానికి భారీ ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.

గ‌తంలో ప‌లు అంత‌ర్జాతీయ స‌మ్మిట్స్ జ‌రిగినా.. ఈసారి  జ‌రిగినంత భారీ హ‌డావుడి మాత్రం గ‌తంలో క‌నిపించ‌లేదు. దాదాపు 1500 మంది విదేశీ అతిధులు వ‌చ్చే ఈ స‌ద‌స్సుకు అమెరికా అధ్య‌క్షుడి కుమార్తె ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఆమె వ‌స్తున్న నేప‌థ్యంలో.. ఆమె ఎక్క‌డైతే ప‌ర్య‌టిస్తారో.. ఆ ప్రాంతాల్లో దాదాపు రూ.60 కోట్ల వ‌ర‌కు రోడ్ల‌ను అందంగా త‌యారు చేసేందుకు వెచ్చిస్తున్నారు. ఈ స‌ద‌స్సు కోసం జీహెచ్ఎంసీ ఒక్క‌టే దాదాపు రూ.100 కోట్ల ఖ‌ర్చు మీదేసుకుంటుద‌ని చెబుతున్నారు.

ఏర్పాట్లు.. ఖ‌ర్చు విష‌యాన్ని ప‌క్కన పెడితే.. ఈ స‌ద‌స్సు సంద‌ర్భంగా ఏర్పాటు చేసే విందులో లిక్క‌ర్ స‌ర్వ్ చేస్తారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. పెద్దఎత్తున విదేశీప్ర‌ముఖులు హాజ‌ర‌వుతున్న స‌ద‌స్సులో మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేయ‌రా? అన్న‌ది ప్ర‌శ్న‌. దీనికి సంబంధించి అధికార వ‌ర్గాలు అందిస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. ఈ నెల 28న మోడీ నేతృత్వంలో నిర్వ‌హించే ఫ‌ల‌క్ నుమా విందులో మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేయ‌టం ఉంద‌ని చెబుతున్నారు. భార‌త ప్ర‌భుత్వ ప్రోటోకాల్ ప్ర‌కారం.. ప్ర‌ధాని అధ్యక్ష‌త‌న నిర్వ‌హించే విందుల్లో మ‌ద్యాన్ని  పంపిణీ చేయ‌రు. ప్రోటోకాల్ వ్య‌వ‌హారం కావ‌టంతో ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ లో మోడీ హోస్ట్ చేసే విందులో నో లిక్క‌ర్ అని చెబుతున్నారు

అదే స‌మ‌యంలో త‌ర్వాతి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ హోస్ట్ చేసే విందులో మాత్రం లిక్క‌ర్ ను ప‌రిమితంగా పంపిణీ చేస్తార‌ని చెబుతున్నారు. అయితే.. మ‌ద్యం పంపిణీ కేవ‌లం విదేశీ అతిధుల‌కు మాత్ర‌మే ఇస్తారు త‌ప్పించి.. దేశీయ అతిధుల‌కు మాత్రం లిక్క‌ర్ స‌ర్వ్ చేయ‌ర‌ని తెలుస్తోంది. ఇవాంకా విందులో భాగంగా స‌ర్వ్ చేసే మ‌ద్యాన్ని తాగాల‌నుకునే వారికి తాజా వివ‌రాలు ఇబ్బంది క‌లిగించేవేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News