దేశంతో పాటుగా ,రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా మహమ్మారి కేసులకు సంబంధించి తెలంగాణ మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, ఏపీ, మహారాష్ట్రలో కేసులు పెరిగాయని ఆయన అన్నారు. దీని ప్రభావంతో తెలంగాణలో కూడా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. కేసుల సంఖ్య పెరిగినా , వైరస్ తీవ్రత తగ్గుతుందన్న ఆయన ప్రైవేటు మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల యాజమాన్యాలతో భేటీ అయ్యామని అన్నారు. బెడ్స్ అందుబాటులో ఉంచాలని కోరామన్న ఆయన బహిరంగ సభలకు వెళ్లకూడదు, అవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని అన్నారు.
అలాగే రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ ప్రసక్తే లేదు, సాధారణ జీవితం కొనసాగించాల్సిందేనని అయన అన్నారు. కరోనాతో జీవించాల్సిందే అందుకే ప్రతి ఇల్లు ఔషధాలయంగా పనిచేయాలని అన్నారు. టీకాలు, ట్రీట్ మెంట్ ప్రతి జిల్లాలో అందుబాటులో ఉందని, తెలంగాణ లో ప్రస్తుతం వాక్సిన్ కొరత లేదు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాక్సిన్ సరఫరా సరఫరా చేయాలని కేంద్రానికి లేఖ రాశామని అన్నారు.ప్రజలెవరూ పుకార్లు నమ్మొద్దన్నారు. తెలంగాణలో లాక్‌డౌన్ ప్రసక్తే లేదని తెలిపారు.
తెలంగాణలో మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల మధ్య 2,909 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... ఒక్కరోజులో కరోనాతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 584 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,091కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,04,548 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,752గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 17,791 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 11,495 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 487 మందికి కరోనా సోకింది.