తెలంగాణ‌లోనే కాదు..ఈ రాష్ట్రాల్లో కూడా నో లాక్ డౌన్‌

Update: 2021-06-07 03:30 GMT
దేశంలో విలయతాండవం సృష్టించిన కరోనా సెకండ్ వేవ్ ఇటీవ‌లి తీవ్రత తగ్గుతూ వస్తోంది. దేశ‌వ్యాప్తంగా న‌మోదు అవుతున్న కేసులు దీనికి నిద‌ర్శ‌నం. అయితే, పలు దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తగ్గనట్లుగా గ‌ణాంకాలు చెప్తున్నాయి. కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న  కొన్ని రాష్ట్రాలు అన్‌‌లాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ సైతం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటుంద‌నే స‌మాచారం ఉండ‌గా మ‌రిన్ని రాష్ట్రాలు సైతం అదే బాట‌లో ఉన్నాయ‌ని జాతీయ మీడియా విశ్లేషిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 9 వరకు లాక్‌‌డౌన్ కొనసాగనుంది. ఆ తర్వాత లాక్‌‌డౌన్‌ను కొనసాగిస్తారా లేదా సడలింపులతో అన్‌లాక్ ప్రక్రియ మొదలు పెడతారా అనే విష‌యంలో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌న‌ప్ప‌టికీ, రాష్ట్రంలో కేసుల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదవుతోందని, ప్రస్తుతం పాజిటివ్‌ రేటు 2 శాతమే ఉంటోందని ఆరోగ్య శాఖ తెలిపింది. వైద్య ఆరోగ్య శాఖ అందించే నివేదికల ఆధారంగానే ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటున్నందున.. ఈ నెల 9 తర్వాత పగటివేళల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇప్ప‌టికే దేశ రాజధాని ఢిల్లీలో మే 31 నుంచి అన్‌లాక్ ప్రక్రియ మొదలైంది. జూన్ 7 నుంచి ఢిల్లీలో మెట్రో సేవలు 50 శాతం కెపాసిటీతో షురూ కానున్నాయి. అలాగే మార్కెట్‌‌లు, మాల్స్ కూడా సరి, బేసి పద్ధతిలో తెరుచుకోనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌‌లో కూడా ఈనెల 7 నుంచి లాక్‌డౌన్ సడలింపులు ఉంటాయని యోగి సర్కార్ తెలిపింది. కంటైన్‌‌మెంట్ జోన్‌‌ల్లో వారంలో ఐదు రోజులపాటు మార్కెట్‌లు, షాపులు తెరుచుకోవచ్చునని స్పష్టం చేసింది. అయితే నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ మాత్రం కొనసాగుతుందని పేర్కొంది. రాజస్థాన్‌‌లో ఈనెల 2వ తేదీ నుంచి అన్‌‌లాక్ ప్రక్రియ మొదలైంది. పలు సడలింపులతో అన్‌‌లాకింగ్‌‌ను అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం ఇప్పటికే స్టార్ట్ చేసింది. దీంతో మ‌ళ్లీ రాష్ట్రాల మ‌ధ్య రాక‌పోక‌ల విష‌యంలో స‌మ‌స్య‌లు స‌మ‌సిపోనున్నాయ‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News