ఏపీలో అధికార బదిలీ వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.పోలింగ్ పూర్తి అయిన నాటి నుంచి లెక్కలు డొక్కలు ఎన్ని వేసుకున్నా.. ఏపీలో అధికారం జగన్ దేనన్న మాట బలంగా వినిపిస్తోంది. ఓట్లు వేసిన వారికి సంబంధించిన నిర్వహించిన శాంపిల్ సర్వేలు సైతం జగన్ చేతికే పవర్ అన్న వేళ.. బాబు బ్యాచ్ ఢీలా పడింది.
జగన్ సీఎం అయితే.. చంద్రబాబు పని అయిపోతుందంటూ సాగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు బాబు బ్యాచ్ సరికొత్త వాదనను తెర మీదకు తెస్తోంది. జగన్ సీఎం అయినంత మాత్రాన బాబుకు జరిగే నష్టం ఏమీ ఉండదన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బాబు మీద ఎలాంటి ఒత్తిడి ఉండదన్న మాటను చెబుతున్నా.. ఆ విశ్లేషణలో పస లేదన్న మాట వినిపిస్తోంది.
ఇంతకీ బాబు బ్యాచ్ వాదన ఏమంటే.. బాబుకు ఏపీలో పవర్ పోయినా.. ఆయన మిత్ర బృందమే ఇప్పుడాయనకు బలంగా మారుతుందని చెబుతున్నారు. పశ్చిమబెంగాల్ ఫైర్ బ్రాండ్ మమతకు వీలైనంత భారీగా సీట్లు సాధించే వీలుందంటున్నారు. దేశంలో బీజేపీ కాకుండా అత్యధిక సీట్లు సాధించే పార్టీ కాంగ్రెస్ అయితే.. ఆ తర్వాతి స్థానంలో మమత ఉంటారని.. ఆ తర్వాతి స్థానంలో బీఎస్పీ.. ఎస్పీ ఉండే వీలుందంటున్నారు. వీరే కాకుండా స్టాలిన్.. శరద్ పవార్ పార్టీలు కూడా ఉండే వీలుంది. అంటే.. బాబుకు సీట్లు రాకున్నా.. ఆయన మిత్ర బృందానికి ఉండే పవర్ తో బాబు తనకు సమస్యలు రాకుండా చేసుకుంటారన్న విశ్లేషణ వినిస్తోంది.
ఈ వాదనలోని ప్రధాన లోపం ఏమంటే.. మోడీ బ్యాచ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వీలు లేనప్పుడు మాత్రమే ఇప్పుడు వినిపిస్తున్న వాదనంతా వర్క్ వుట్ అయ్యేది. ఒకవేళ మోడీ ప్రభుత్వం పవర్లోకి వస్తే బాబుకు ఎలాంటి ఛాన్స్ ఉండకపోగా.. దీదీ.. కుమారస్వామితో సహా ఆయన మిత్రులకు కొత్త ఇబ్బందులు ఖాయం. ఒకవేళ.. కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం రాకున్నా.. థర్డ్ ఫ్రంట్ పురుడు పోసుకున్నా.. బాబుకు సానుకూల పరిస్థితులు ఉంటాయని చెప్పటం కష్టమే. ఎందుకంటే.. పవర్ ఉన్నోడి మాటకు.. పవర్ లేనోడి మాటకు ఉండే విలువ ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత స్నేహితుడైనా వంగతోట రూల్ పవర్ లేనోడికి వర్తిస్తుందన్న విషయాన్ని బాబు బ్యాచ్ మిస్ అవుతుందని చెప్పక తప్పదు.