బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ పర్యటన ఉత్సాహభరితంగా సాగుతోంది.నిన్న గుజరాత్ లో లభించిన ఘన స్వాగతానికి ఫిదా అయిన బ్రిటన్ ప్రధాని తన జన్మలో ఇలాంటి ఆతిథ్యం అందుకోలేదని కొనియాడారు. ఈరోజు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో శుక్రవారం చర్చలు జరిపారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న క్లిష్టమైన అంశాలపై వీరి మధ్య చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
భారత్ లో మద్యం విక్రయాలు అత్యధిక స్థాయిలో ఉంటాయి. మరే దేశంలోనూ ఈస్థాయిలో విస్కీ విక్రయాలుండవు. బ్రిటన్ లోని ప్రపంచ ప్రఖ్యాత స్కాచ్ విస్కీకి భారత్ లో అంత ఆదరణ లేదు. ఎందుకంటే భారత్ లో తాగే స్కాచ్ విస్కీ ధర చాలా ఎక్కువ. భారత్ విధించే 150 శాతం దిగుమతి సుంకాలే దీనికి కారణంగా చెప్పొచ్చు.
భారత్ లోని విస్కీలో చాలా వరకూ స్థానికంగా తయారు చేస్తుంటారు. ఇక్కడి మార్కెట్ లో బ్రిటన్ స్కాచ్ కేవలం 2శాతం మాత్రమే. ఈ సుంకాలను తగ్గిస్తే విస్కీ ఎగుమతులు ఐదేళ్లలోనే ఒక బిలియన్ పౌండ్లకు పెరుగుతాయని స్కాచ్ విస్కీ అసోసియేషన్ తెలిపింది.
కేవలం విస్కీ మాత్రమే కాదు.. బ్రిటన్ నుంచి వచ్చే చాలా దిగుమతులపై భారత్ భారీగా సుంకాలు, కోటాలు, ఆంక్షలు విధిస్తోంది. బ్రిటన్ నుంచి వచ్చే విదేశీ కార్లపై 100శాతం వరకూ సుంకాలు విధిస్తున్నారు. ఫలితంగా భారత్ లో బెల్జియం లాంటి చిన్న దేశంతో సమానమైన పరిణామంలో మాత్రమే ఎగుమతులు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే ఈ ఏడాది ప్రారంభంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే లక్ష్యంగా బ్రిటన్-భారత్ చర్చలు మొదలుపెట్టాయి. డిసెంబర్ నాటికి ఈ ఒప్పందం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మూడో దఫా చర్చలు వచ్చే వారం మొదలుకానున్నాయి.
ఈ క్రమంలోనే బ్రిటన్ ప్రధాని భారత్ పర్యటనపై అక్కడి కంపెనీలు భారీ ఆశలు పెంచుకున్నాయి. తాజా ఒప్పందంతో 2035 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యం రెట్టింపుపై దాదాపు 28 బిలియన్ పౌండ్లకు పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవలే ఆస్ట్రేలియా, యూఏఈలు కూడా భారత్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒఫ్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో బ్రిటన్ కూడా తరలివచ్చింది. ఈ ఒప్పందంలో రెండు దేశాల దగ్గరా ప్రత్యేకమైన జాబితాలున్నాయి. వీటిపై ఏకాభిప్రాయం కుదరడమే కష్టంగా కనిపిస్తోంది.
తయారీ, సేవల రంగాల్లో తమ పరిశ్రమలకు మరింత అవకాశాలు కల్పించాలని బ్రిటన్ డిమాండ్ చేస్తోంది. ఈ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు భారత్ సుముఖంగా లేదు. ఈ ఆంక్షలు దేశీయ పరిశ్రమలను కాపాడడానికి చాలా ముఖ్యమైనవి మోడీ సర్కార్ కృతనిశ్చయంతో ఉంది. భారత్ లో తయారీని ప్రోత్సహిస్తోంది. దీంతో బ్రిటన్ ప్రతిపాదనలకు భారత్ అంగీకరించలే అవకాశాలు లేవంటున్నారు.