దేశ ప్రజలకు క్రికెట్ మీద ఉండే అభిమానం.. ఆరాధన ఎంతన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. మతంగా ఫీలయ్యే క్రికెట్ ఆట స్వరూపాన్ని మార్చేసిన ఫార్మాట్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ అని చెప్పక తప్పదు. బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తున్న ఈ ఫార్మాట్ లో ఆట కంటే కూడా మసాలానే ఎక్కువన్న మాట వినిపిస్తుంది.
ఆట పేరుతో భారీ ఎత్తున వ్యాపారం చేసే ఈ ఫార్మాట్ లో స్పెషల్ అట్రాక్షన్లకు కొదవలేదు. మైదానంలో ఆటగాళ్ల మెరుపులకు ధీటుగా.. స్టేడియంలో చీర్ లీడర్లు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. తళుకు బెళుకుల పొట్టి వస్త్రాల్ని ధరించే విదేశీ చీర్ లీడర్లు సందడి ఐపీఎల్ కు కొత్త కిక్కు ఇచ్చిందని చెప్పాలి. పొదుపైన వస్త్రాల్ని ధరించి వేలాది ముందు గెంతే ఈ చీర్ లీడర్లను అసభ్యకర యాంగిల్స్ లో ఫోటోలు చేసి.. కొందరు చేస్తున్న దుష్ప్రచారం పుణ్యమా అని ఐపీఎల్ ఇమేజ్ అంతకంతకూ మసకబారుతోంది. టైట్ అవుట్ ఫిట్స్ తో విదేశీ భామలు చేసే నృత్యాల పుణ్యమా అని జనాల ఫోకస్ ఆట మీద కంటే విదేశీ భామల మీదనే ఎక్కువగా ఉందన్న మాట ఉంది.
ఇదిలా ఉంటే.. రోజులు గడుస్తున్న కొద్దీ ఐపీఎల్ లో ఆట కంటే కూడా మసాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారన్న విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. వీటికి తోడు పలు వివాదాలు ఐపీఎల్ ప్రతి సీజన్లోనూ చోటు చేసుకుంటూ ఐపీఎల్ ఫార్మాట్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాయి. తాజాగా ఐపీఎల్ ప్రసారహక్కుల్ని సొంతం చేసుకున్న స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ లో చీర్ లీడర్లకు పుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. ఆట మీదనే ఎక్కువ దృష్టి పెట్టేలా తామీ నిర్ణయాన్ని వెల్లడించినట్లు పేర్కొంది. స్టార్ స్పోర్ట్స్ తీసుకున్న నిర్ణయంతో ప్రకటనల ఆదాయం మీద ప్రభావం పడుతుందేమోనన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటే.. అలాంటిదేమీ ఉండదన్న మాట మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఎవరి మాట నిజమన్నది తాజా సీజన్ తేలుస్తుందని చెప్పక తప్పదు.