విద్యార్థి విన్నపాన్ని లైట్ తీసుకున్న రాహుల్ గాంధీ

Update: 2016-01-19 13:48 GMT
దేశంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నా చాలా వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా ఉండే కాంగ్రెస్ యువరాజు రాహుల్.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఒక పీహెచ్ డీ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటనకు స్పందించారు. ఆఘమేఘాల మీద ఢిల్లీ నుంచి హైదరాబాద్ గల్లీలోకి వచ్చేశారు. రాహుల్ లాంటి వ్యక్తి ఒక విద్యార్థి ఆత్మహత్యకు పరుగులు పెడుతూ రావటం వెనుక రాజకీయ లెక్కలు తెలీనంత చిన్నోళ్లేం కాదు వర్సిటీ విద్యార్థులు.

అందుకే.. రాహుల్ తన ప్రసంగాన్ని షురూ చేయాలనుకున్న వేళ.. ఒక విద్యార్థి మాట్లాడుతూ.. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య రాజకీయ పోరుగా మార్చకూడదని.. తాము రోహిత్ కు న్యాయం జరగాలని మాత్రమే పోరాడుతున్నట్లుగా స్పష్టం చేశారు.

ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చింది రాజకీయం పండించాలన్న ఆలోచనలో ఉన్న రాహుల్ కు సదరు విద్యార్థి మాటలు పెద్దగా పట్టలేదు. తాను ఏం అనుకున్నారో అలానే చేసేశారు. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ.. బండారు దత్తాత్రేయ.. వీసీ మీద పేర్లు ప్రస్తావించకుండా విరుచుకుపడి.. తన ప్రసంగం అయ్యాక తన దారిన తాను పోయారు.

రాజకీయ నాయకులకు రాజకీయ ప్రయోజనాలు తప్పించి.. ఎవరి భావోద్వేగాలు పట్టవన్న విషయాన్ని రాహుల్ మరోసారి తన చర్యలతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
Tags:    

Similar News