ఇకపై జగన్‌ కు నా మద్దతు ఉండదు : పోసాని

Update: 2019-05-24 07:21 GMT
ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ ప్రభంజనం సృష్టించిన విషయం తెల్సిందే. నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగు దేశం పార్టీని, దాదాపు అయిదు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడును చిత్తు చేసిన జగన్‌ ఈనెల 30వ తారీకున సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జగన్‌ కు మద్దతుగా ఇండస్ట్రీ నుండి పలువురు ప్రచారం చేయడం జరిగింది. అందులో ప్రముఖంగా చెప్పుకోదగ్గ వ్యక్తి పోసాని కృష్ణ మురళి. ఈయన తనదైన శైలిలో మాట్లాడుతూ జగన్‌ సీఎం అవ్వాలని, అవుతాడని కోరకుఉంటూ ప్రచారం చేశాడు. తాజాగా జగన్‌ సీఎంగా అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పోసాని మాట్లాడుతూ... నాకు జీవితంలో మిగిలి పోయిన ఒకే ఒక్క కోరిక నిన్న తీరింది. జగన్‌ సీఎం అవ్వాలని కోరుకున్న నాకు ఆ కోరిక నెరవేరడం చాలా సంతోషంగా ఉంది. మంచి కెరీర్‌, బాగానే ఆస్తులు, మంచి భార్యను, మంచి పిల్లలను పొందిన నాకు జగన్‌ సీఎం అవ్వాలని ఒకే ఒక్క కోరిక ఉంది. అది తీరిపోయింది. నా జీవితంలో మిగిలి ఉన్న చివరి కోరిక జగన్‌ సీఎం అవ్వడం, అది కూడా తీరడంతో చాలా సంతోషంగా ఉన్నాను. నిన్న మొన్నటి వరకు జగన్‌ ను వాడు, వీడు, ఫ్యాక్షనిస్ట్‌ అంటూ సంభోదించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్‌ సీఎం అవ్వగానే శుభాకాంక్షలు తెలియజేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నాడు.

ఇకపై జగన్‌ కు నా మద్దతు ఉండదు. ఇకపై ఎప్పుడు కూడా జగన్‌ కు ఓటు వేయమని అడగను. ఎందుకంటే ఇకపై వరుసగా జగన్‌ సీఎం అవుతాడు. ఆయన పాలన చూసి తప్పకుండా జనాలు వరుసగా ఆయన్ను సీఎంగా చేసుకుంటారనే నమ్మకం నాకుందని ఈ సందర్బంగా పోసాని చెప్పుకొచ్చాడు. ప్రజలు జగన్‌ కు అద్బుతమైన విజయాన్ని అందించారు. ఇప్పుడు జగన్‌ కూడా తప్పకుండా వారికి అద్బుతమైన పాలనను అందిస్తాడనే నమ్మకం నాకుందని ఈ సందర్బంగా పోసాని చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News