ఆసక్తికరమైన ఆదేశాన్ని జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఎన్నికల సందర్భంగా బరిలో నిలిచిన ఏ అభ్యర్థి మీదా సరైన అభిప్రాయం లేకపోవటం.. ఎవరికి ఓటు వేయాలన్న భావన కలిగినప్పుడు.. తన ఓటుతో ఆ వ్యతిరేకతను వ్యక్తం చేయటానికి వీలుగా నోటా ఓటును తెర మీదకు తీసుకురావటం తెలిసిందే.
అయితే.. ఈ నోటా ఓటు విషయంలో తాజాగా ఒక క్లారిటీ ఇచ్చింది సుప్రీం కోర్టు. నోటా అనేది ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే ఉపయోగించాలని పేర్కొంది. నోటాను పరోక్ష ఎన్నికల్లో కుదరదని తేల్చి చెప్పింది. రాజ్యసభలో నిర్వహించే ఎన్నికల్లో నోటాను ఉపయోగించొచ్చన్న అంశంపై తాజాగా ఆదేశాలు జారీ చేసిన సుప్రీం.. స్పష్టతను ఇచ్చింది.
నోటాను కేవలం ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే ఉపయోగించాలన్న సుప్రీం.. రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రజలు ఎన్నుకోరు.. అందుచేత బ్యాలెట్ పేపర్లలో నోటాను ముద్రించాల్సిన అవసరం లేదని పేర్కొంది. సుప్రీం చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా.. జస్టిస్ డీవై చంద్రచూడ్.. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. సో.. రాజ్యసభలో నిర్వహించే ఎన్నికలకు నోటా ఉండదన్న మాట. ఆ మాటకు వస్తే.. పరోక్ష ఎన్నికల్లో నోటా అవసరం లేదన్నది సుప్రీం తాజా మాటగా చెప్పక తప్పదు.