అమ్మ వార‌సుల‌పై క్లారిటీ వ‌చ్చేసింది

Update: 2018-01-07 05:09 GMT
అమ్మ‌గా త‌మిళ ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నిలిచిపోయిన జ‌య‌ల‌లిత వార‌సుల‌కు సంబంధించిన స్ప‌ష్ట‌త‌ను తాజాగా ఇచ్చేశారు. అనారోగ్యంతో అపోలో ఆసుప‌త్రికి చేరి.. అక్క‌డే మ‌ర‌ణించిన ఆమెకు ప్ర‌త్య‌క్ష వార‌సులు తామేనంటూ ప‌లువురు తెర మీద‌కు రావ‌టం తెలిసిందే.

దీనిపై జ‌రుగుతున్న త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల‌కు ఫుల్ స్టాప్ ప‌డంది. జ‌య‌ల‌లిత‌కు ప్ర‌త్య‌క్ష వార‌సులు ఎవ‌రూ లేరంటూ చెన్నై జిల్లా క‌లెక్ట‌ర్ అన్ము సెల్వ‌న్ తాజాగా తేల్చేశారు. అంతేకాదు అమ్మ నివాస‌మైన వేద నిల‌యాన్ని ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంటుంద‌న్న మాట‌ను చెప్పారు. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత చోటు చేసుకున్న నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో అమ్మ నివ‌సించిన పోయెస్ గార్డెన్ లోని వేద నిల‌యాన్ని స్మార‌క మందిరంగా ప్ర‌క‌టిస్తూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో వేద నిల‌యాన్ని స్వాధీనం చేసుకునేందుకు అవ‌స‌ర‌మైన క‌స‌ర‌త్తును ప్ర‌భుత్వం పూర్తి చేస్తోంది. రానున్న నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలో వేద నిల‌యం ప్ర‌భుత్వం అధీనంలోకి వెళ్ల‌నుంది. ఇప్ప‌టికే వేద నిల‌యం స్థ‌లం వివ‌రాల‌తో పాటు.. ఆస్తి విలువ లెక్క‌ను మదింపు చేయ‌టం పూర్తి అయిన‌ట్లుగా చెబుతున్నారు. ఇక‌.. ఆ ఇంట్లోని రెండు గ‌దుల్ని ఆదాయ‌ప‌న్ను శాఖ సీజ్ చేసి ఉన్న నేప‌థ్యంలో.. ఆ రెండు గ‌దుల్లో ఏం ఉన్నాయ‌న్న‌ది ఇప్పుడు బ‌య‌ట‌కు రావాల్సి ఉంది.

అమ్మ వార‌సులుగా జ‌య మేన‌కోడ‌లు దీప‌.. మేన‌ళ్లుడు దీప‌క్  ఇద్ద‌రు తామే వార‌సుల‌మ‌ని చెబుతున్న వేళ‌.. మ‌ధ్య‌లో బెంగ‌ళూరుకు చెందిన అమృత తెర మీద‌కు రావ‌టం తెలిసిందే. తాను జ‌య‌ల‌లిత కుమార్తెన‌ని.. కావాలంటే డీఎన్ ఏ ప‌రీక్ష చేసుకోవాల‌ని కోర‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అమ్మ‌కు ప్ర‌త్య‌క్షంగా వార‌సులు ఎవ‌రూ లేర‌ని చెప్ప‌టం ద్వారా.. అమ్మ ఆస్తుల్ని ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవ‌టానికి రంగం సిద్ధం చేశారు. నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఆస్తుల స్వాధీనం ముందు ప‌బ్లిక్ నోటీసు ఇస్తారు. ఆ సంద‌ర్భంగా ఆస్తిపై త‌మ‌కున్న హ‌క్కు విష‌యంలో త‌మ వాద‌న వినిపించుకోవ‌టానికి దీప‌.. దీప‌క్‌..అమృత‌ల‌కు అవ‌కాశం ఉంటుంది. 
Tags:    

Similar News