తెలుగు న్యూస్ ఛానెళ్లకే కొత్త దశ దిశ నేర్పిన ఛానెల్ గా టీవీ 9కు, దానిని స్థాపించిన రవిప్రకాశ్ కు మంచి గుర్తింపే లభించింది. అప్పటిదాకా ఏదో రోజుకు మూడు, నాలుగు సార్లు మాత్రమే వార్తలు వినబడితే... రవిప్రకాశ్ చొరవతో టీవీ 9 ఎంట్రీ ఇచ్చాక ప్రతి క్షణమూ వార్తలే వినబడుతున్నాయి. టీవీ 9 ఊతపదం మాదిరే నిరంతర వార్తా స్రవంతి మాదిరే ఇప్పుడు ఎప్పుడు టీవీ ఆన్ చేసినా బోలెడన్ని వార్తలు మన ముందుంటున్నాయి. ఈ లెక్కన రవిప్రకాశ్ కు జనంలో మంచి మైలేజీనే దక్కింది. అయితే ఆ మైలేజీ మంచిదా? చెడు పరంగానా? అన్న విషయం నిన్న తేలిపోయింది. నిన్న పొద్దటి నుంచి టీవీ 9లో సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు, రవిప్రకాశ్ విచారణ, ఆయన ఇళ్లల్లోనూ సోదాలు మొత్తంగా రచ్చరచ్చనే సాగింది. సాయంత్రం దాకా అంతటా టీవీ 9 రవిప్రకాశ్ కు సంబంధించి వార్తలే. రవి ప్రకాశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, ఆయనను టీవీ 9 సీఈఓ పదవి నుంచి తొలగించారని ఒకటే వార్తల గోల.
ఈ వార్తల దెబ్బకు అప్పటిదాకా ఎక్కడున్నారో తెలియదు గానీ... నిన్న రాత్రి 7 గంటలవుతున్న వేళ... అకస్మాత్తుగా టీవీ 9 తెరపై రవిప్రకాశ్ ప్రత్యక్షమైపోయారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని, తాను అరెస్ట్ కాలేదని, తనను అరెస్ట్ చేయబోవడం కూడా లేదని... తనదైన శైలిలో వార్తలను గుక్క తిప్పుకోకుండా వినిపించారు. ఓ పది నిమిషాల పాటు రవి ప్రకాశ్ తెరపై కనిపించి... నిన్న పొద్దున నుంచి జరగిన ప్రచారంపై వివరణ ఇచ్చేసి అదృశ్యమైపోయారు. అయితే ఎప్పుడైతే... టీవీ 9 తెరపై రవిప్రకాశ్ ప్రత్యక్షమైపోయారో... జనం కూడా టీవీ 9 కామెంట్ బోర్డుపై ఎక్కేశారు. రవి ప్రకాశ్ చేసిన ప్రతి కామెంట్ కు కౌంటర్ ఇస్తూ తమదైన శైలిలో రవి ప్రకాశ్ తో పాటు టీవీ 9కు చుక్కలు చూపారు. రవి ప్రకాశ్ వివరణ సాగినంత సేపు టీవీ 9 కామెంట బోర్డుపై కామెంట్లు పరుగులు పెట్టాయంటే అతిశయోక్తి కాదేమో.
ఈ కామెంట్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా రవిప్రకాశ్ కు అనుకూలంగా లేవనే చెప్పాలి. ప్రతి కామెంట్ రవిప్రకాశ్ కు వ్యతిరేకంగా దూసుకువచ్చినదిగానే చెప్పాలి. కొందరు కాస్తంత మర్యాదగానే రవిప్రకాశ్ నైతికతను ప్రశ్నిస్తే... మరికొందరు ఏకంగా రవిప్రకాశ్ పై బూతుల పర్వం అందుకున్నారు. మొత్తంగా రవిప్రకాశ్ టీవీ 9 స్క్రీన్ పై కనిపించినంత సేపే కామెంట్ బోర్డు వేదికగా ఆయనను జనం బాగానే ఏసుకున్నారని చెప్పాలి. ఈ కామెంట్లను చూస్తే.. జనంలో రవిప్రకాశ్ కు ఎలాంటి మైలేజీ ఉందో ఇట్టే అర్థం కాక మానదు. తెలుగు మీడియా రంగంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చిన వ్యక్తిగా రవిప్రకాశ్ పై జనానికి కించిత్ అభిమానం కూడా లేదనే చెప్పాలి.
మొత్తంగా తనపై కేసులు నమోదైపోయి, నేడో, రేపో అరెస్ట్ తప్పదన్న వాదనలు వినిపిస్తున్న సమయంలో రవిప్రకాశ్ కు జనం నుంచి మద్దతు లభించకపోగా... తగిన శాస్తే జరిగిందన్న మాటే వినిపించడం చూస్తే నిజంగానే ఆశ్చర్యం వేయక మానదు. ఇక కామెంట్ బోర్డుపై రవిప్రకాశ్ ను ఏసుకుంటూ జనం పెట్టిన కామెంట్ల దెబ్బకు టీవీ 9 యాజమాన్యానికి కూడా తలంటేసినట్టుగానే అనిపించిందేమో... వెంటనే రవిప్రకాశ్ స్క్రీన్ పై కనిపించిన వీడియోకు వెల్లువెత్తిన కామెంట్లను డిజేబుల్ చేసేసింది.
వీడియో కోసం క్లిక్ చేయండి