ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చర్చ అంతా స్థానిక ఎన్నికలపైనే ప్రధానంగా సాగుతోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సోమవారమే నోటిఫికేషన్ జారీ అయ్యింది. అయితే ఈ క్రమంలో ఒక విషయం అందరూ మరచిపోతున్నారు. ఇన్నాళ్లు రాజధాని తరలిపోతుందని ఆందోళన చేసిన వారంతా స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని సిద్ధంగా ఉండగా వారికి ఓ షాకిచ్చే విషయం తెలిసింది. ప్రస్తుతం రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ లో రాజధాని ప్రాంత గ్రామాలు లేవు. ఎందుకంటే ఆ గ్రామాలన్నీ మున్సిపాలిటీ కిందకు వస్తాయి. అయితే దీనిపై కూడా క్లారిటీ లేదు.. మున్సిపాలిటినా? కార్పొరేషనా అనేది ఇంకా తెలియలేదు. దీంతో ఆ గ్రామాల్లో ప్రస్తుతానికైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం లేదు.
ఎందుకంటే రాష్ట్ర విభజన అనంతరం రాజధానిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి కేంద్రంగా 29 గ్రామాలను కలిపి ప్రకటించారు. అందులో భాగంగా వెలగపూడి, తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కొంత మేర నిర్మించారు. అమరావతి రాజధాని ప్రాంతంగా 29 గ్రామాలను కలిపి నిర్ణయించారు. సీఆర్ డీఏ పరిధిలోకి ఆ మూడు మండలాల్లోని 29 గ్రామాలను కలిపారు. అయితే ఆ గ్రామాలన్నీ కలిపి ఒక అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని భావించారు. అయితే కార్పొరేషన్ కాకుంటే తుళ్లూరు, వెలగపూడి, తాడేపల్లిలను మున్సిపాలిటీలుగా చేయాలని కూడా చూశారు. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే పదవీకాలం చంద్రబాబు ముగించారు. అయితే అధికారం మారింది. చంద్రబాబు పోయి జగన్ ముఖ్యమంత్రిగా వచ్చారు. ఇప్పుడు ఆయన అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ప్రతిపాదించారు. కర్నూలు, విశాఖ పట్టణంతో పాటు అమరావతి కూడా రాజధానులు గా కొనసాగుతాయి.
గత ప్రభుత్వం నిర్ణయంతో ప్రస్తుతం స్థానిక ఎన్నికలు రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో జరగడం లేదు. అయితే అమరావతిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తాయని అధికార పార్టీ వైఎస్సార్సీపీ భావించింది. అయితే జగన్ నిర్ణయానికి ఎక్కడ రాజధాని ప్రాంత గ్రామస్తులు మద్దతు తెలుపుతారోనని టీడీపీ భయపడింది. ఈ రెండు పార్టీలు తమకు వ్యతిరేకంగా ఫలితం వస్తుందని భావించిన క్రమంలో ఈ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించకుండా ఎన్నికల సంఘం హోల్డ్ లో పెట్టింది. ఆ నిర్ణయమే ఆ రెండు పార్టీలను కాపాడింది. ఎందుకంటే రాజధాని ప్రాంతం తరలిస్తుండడంతో తమకు వ్యతిరేక ఫలితాలు వస్తాయని వైఎస్సార్సీపీ భావించింది. అయితే రాజధాని ఉద్యమాన్ని కష్టపడి నడిపిస్తున్న టీడీపీ స్థానిక ఎన్నికలు వస్తే జగన్ నిర్ణయానికి ఎక్కడ రాజధాని ప్రాంత గ్రామస్తులు మద్దతు తెలుపుతారేమోనని కంగారు పడింది. ఒకవేళ ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతు తెలిపితే తాము నడిపిన ఉద్యమం ఫేక్ అని తేలడంతో పాటు జగన్ తీసుకున్న అధికార వికేంద్రీకరణ నిర్ణయానికి మద్దతు తెలిపినట్లుగా భావించేవారు. ఇప్పుడు ఎన్నికలు లేకపోవడంతో ఆ పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి.