ఏపీలోకి సీబీఐ రావొచ్చు.. ఎలాంటి రూల్స్ అడ్డురావంతే!

Update: 2019-06-06 12:24 GMT
నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో ఎక్స్ ప్రెస్ వేగాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న జ‌గ‌న్ స‌ర్కార్.. తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏపీలో సీబీఐ అడుగు పెట్టేందుకు ప‌ర్మిష‌న్ లేదంటూ రూల్ బుక్ లోని రూల్ చూపించి మ‌రీ సోదాల‌కు నిరాక‌రిస్తూ జారీ చేసిన జీవోను ర‌ద్దు చేసి పారేసింది.  మిగిలిన రాష్ట్రాల్లో మాదిరి ఏపీలో సీబీఐ ఎంట్రీకి ఎప్ప‌టిలానే సాధార‌ణ స‌మ్మ‌తిని పున‌రుద్ధ‌రిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో ఏపీలో కేసుల విచార‌ణ విష‌యంలో సీబీఐకి ఇప్పుడు ఇబ్బందులు ఎదురుకాని ప‌రిస్థితి. గ‌తంలో మాదిరి ఇప్పుడు ఏపీలో సీబీఐ ద‌ర్యాప్తు చేసుకోవ‌టానికి ఎలాంటి అభ్యంత‌రాలు ఉండ‌వు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీబీఐ సోదాల మీద అప్ప‌టి చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌రిమితుల్ని విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

ఎన్నిక‌ల వేళ మోడీతో ఉన్న వైరం నేప‌థ్యంలో.. ఎక్క‌డో ఉన్న రూల్ ను తెర మీద‌కు తీసుకొచ్చారు. ఢిల్లీ మిన‌హా మిగిలిన‌రాష్ట్రాల్లో సీబీఐ త‌నిఖీలు చేప‌ట్టాలంటే.. అందుకు ఆయా రాష్ట్రాల స‌మ్మ‌తి తెల‌పాల్సి ఉంటుంది.

మోడీతో ట‌ర్మ్స్ చెడిపోయిన నేప‌థ్యంలో బాబు స‌ర్కారు సీబీఐ మీద ప‌రిమితులు విధించ‌టంతో.. దాని చేతులు.. కాళ్లుక‌ట్టేసిన ప‌రిస్థితి. తాజాగా జ‌గ‌న్ స‌ర్కారు కొలువు తీర‌టం.. గ‌త ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల్ని స‌మీక్షిస్తూ నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగా సీబీఐ మీద విధించిన ప‌రిమితుల్ని ఎత్తి వేస్తూ తాజాగా జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. తాజా నిర్ణ‌యం నేప‌థ్యంలో ఏపీలోని  కేసుల విచార‌ణ విష‌యంలో సీబీఐకి ఉన్న అడ్డంకులు తొలిగిపోయిన‌ట్లుగా చెప్పాలి.
Tags:    

Similar News