రెండో ఎయిర్ పోర్ట్ ఎత్తిపోయింది

Update: 2015-12-28 04:53 GMT
అమరావతి నగరానికి సంబంధించి ఇప్పటివరకూ ఉన్న అంచనాలకు భిన్నంగా కొన్ని నిర్ణయాలు ముసాయిదా మాస్టర్ ప్లాన్ లో కనిపిస్తున్నాయి. విజయవాడకు సమీపంలో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్టు కు అదనంగా రాజధాని ప్రాంతంలో మరో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తుందన్న మాట తరచూ వినిపించింది. దీనికి తగ్గట్లే కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే.. తాజాగా విడుదల చేసిన ముసాయిదా ప్లాన్ లో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లోని బేగం పేట.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ల మాదిరి.. భవిష్యత్తులో అమరావతిలో ఎయిర్ పోర్ట్ ను శంషాబాద్ తరహాలో.. ప్రస్తుతం ఉన్న గన్నవరం ఎయిర్ పోర్ట్ ను బేగంపేట తరహాలో వినియోగిస్తారన్న మాట వినిపించింది.

అమరావతిలోనిర్మించే ఎయిర్ పోర్ట్ నిడమర్రు దగ్గర ఏర్పాటు చేస్తారన్న అంచనాలు భారీగా వినిపించాయి. దీనికి తగ్గట్లే రియల్ లావాదేవాలు బాగా సాగాయి. ఇందుకు భిన్నంగా ముసాయిదా ప్లాన్ లో రెండో ఎయిర్ పోర్ట్ కు సంబంధించిన ఊసే కనిపించని పరిస్థితి. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చలన్న ఆలోచనతో పాటు.. ఇప్పటివరకూ అందుకు ఆటంకాలుగా ఉన్న పరిస్థితుల్ని అధిగమించే దిశగా అడుగులుపడుతున్న నేపథ్యంలో అమరావతిలో అనుకున్న రెండో ఎయిర్ పోర్ట్ ప్రతిపాదనను పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది. తాజా ముసాయిదా నేపథ్యంలో అమరావతిలో రెండో ఎయిర్ పోర్ట్ అన్నది ఉత్త అంచనా మాత్రమేనని తేలిపోయింది.
Tags:    

Similar News