ఇప్పటివరకూ నో స్మోకింగ్ జోన్.. నో హారన్ జోన్ లాంటివి విని ఉంటారు. కానీ.. ఇప్పుడు కొత్తగా నో సెల్ఫీ జోన్ అనే కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది కర్ణాటక ప్రభుత్వం. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో కొత్త సమస్యలు తెర మీదకు వస్తున్న పరిస్థితుల్లో కర్ణాటక రాష్ట్రంలోని 355 పర్యాటక ప్రాంతాల్లో 60 చోట్ల నో సెల్ఫీ జోన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవటాన్ని నేరంగా పరిగణిస్తారు. పలు పర్యాటక ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదాలకు గురి కావటం.. ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకోవటంతో కర్ణాటక ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో 100 చోట్ల నో సెల్ఫీ జోన్లు ఏర్పాటు చేయాలని భావించారు. ఇందుకు సంబంధించిన నివేదికను పరిశీలించిన కర్ణాటక ప్రభుత్వం 60 ప్రాంతాల్లో సెల్ఫీల కారణంగా ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని భావించి అక్కడ నో సెల్ఫీ జోన్లుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నో సెల్ఫీ జోన్లలో సెల్ఫీలు తీసుకునే వారికి జరిమానా విధిస్తారు. అంతేకాదు.. ఆయా చోట్ల సెల్ఫీలు తీసుకుంటే జైలుశిక్ష వేసే అంశాన్ని కూడా ఆలోచిస్తుండటం గమనార్హం. రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన కొన్ని పర్యాటక ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. సో.. ఇకపై కర్ణాటకకు వెళ్లే వారు ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏమాత్రం తేడా వచ్చినా భారీగా ఫైన్లు కట్టాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.
నో సెల్ఫీ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో కొన్ని..
= జోగ్ జలపాతం
= అబ్బే ఫాల్స్
= ఇరుపూ ఫాల్స్
= మేకెదాటు
=టిప్పు డ్రాప్
= శివసముద్ర ఫాల్స్
= తుంగభద్ర డ్యాం
= గోల్ గుంబాచ్