కాలం ఎంత మారినా, మన పద్దతులు ఎంత మారినా... కొన్ని భావజాలాలు మాత్రం మారడం లేదు. ఆడవాళ్ల డ్రెస్సులపై ఎక్కడో ఒకచోట న్యూసెన్స్ జరుగుతూనే ఉంది. ఎంతో గొప్పగొప్పవాళ్లు అనుకున్నవాళ్లు కూడా అనవసరంగా ఈ విషయంలో కామెంట్లు చేసి మాటలు పడ్డారు. చాలా కాలేజీలు నోటీసులు ఇవ్వడం అభాసుపాలు కావడం జరిగింది. ఎన్ని జరిగినా ఇంకా కొందరు అలాంటి బుద్ధినే ప్రదర్శిస్తున్నారు.
తాజాగా మహారాష్ట్రలోని జేజే గ్రాంట్ మెడికల్ కాలేజీలో స్కర్టులు వేసుకొని క్లాసులకు రావద్దంటూ అమ్మాయిలకు ఆదేశాలు జారీచేసింది కాలేజీ యాజమాన్యం. కాలేజీ డీన్ డా.అజయ్ చందన్ వేల్ పేరుతో ఈ ఉత్తర్వలు అధికారికంగా వచ్చాయి. ఈ ఆదేశాలు మా హక్కులకు భంగకరం అంటూ విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. స్కర్టులు వేసుకునే నిరసన తెలుపుతున్నారు. అయితే ఆ ఆదేశాల్లో రాత్రి పదిలోపే హాస్టల్ కి వచ్చేయాలని - అబ్బాయిలు అమ్మాయిలు ఈవెంట్లు జరిగేటపుడు కలిసి కూర్చోవద్దని కూడా అందులో పేర్కొన్నారు. ఇదంతా ఆ విద్యార్థులకు నచ్చడం లేదు.
హోళీ సందర్భంగా జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో కాలేజీ ఈ సర్కులర్ జారీ చేసిందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి సర్క్యులర్స్ మా వ్యక్తిగత హక్కులను కాలరాసేవిగా ఉన్నాయంటూ విద్యార్థులు నిరసన తెలపడంతో కాలేజీ దీనిపై స్పందించారు. ఈ ఆదేశాల వెనుక ఏ దురుద్దేశాలు లేవని - కేవలం ప్రశాంతతను కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. విద్యార్థుల వెర్షను సావధానంగా వినడానికి సిద్ధమే అంటూ స్పష్టం చేసింది.
ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నవారికి చరిత్రలో ఎలా పరిస్థితి వచ్చిందో తెలిసి కూడా తీసుకోవడం ఎందుకు? సంజాయిషీలు ఇవ్వడం ఎందుకో. ఎన్ని ఘటనలు జరిగినా ఎవరో ఒకరు మళ్లీ మళ్లీ ఆ తప్పు చేస్తూనే ఉంటారేమో.