ప్రఖ్యాత విద్యాసంస్థ ఢిల్లీ ఐఐటీ వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. ఐఐటీ క్యాంపస్ తో పాటు హాస్టల్ గదుల్లోనూ మద్యం.. ధూమపానాన్ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐఐటీ ఢిల్లీలో డ్రింక్ చేయటం.. స్మోక్ చేయటాన్ని పూర్తిస్థాయిలో బ్యాన్ చేయనున్నారు.
దీనికి సంబంధించి విద్యార్థులు సైతం అండర్ టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కాలేజీ లో చేరే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా తాము మద్యం ముట్టుకోమని.. స్మోక్ చేయమని ముందే చెప్పాల్సి ఉంటుంది. క్యాంపస్ లోకి వచ్చే కొత్త విద్యార్థులతో పాటు.. ఇప్పటికే క్యాంపస్ లో ఉన్న విద్యార్థులు సైతం ఈ రూల్ ను పాటించాలని స్పష్టం చేస్తున్నారు.
ఒకవేళ ఈ రూల్ ను బ్రేక్ చేస్తూ.. ఎవరైనా బిహేవ్ చేస్తే మాత్రం అలాంటి వారిపై రూల్స్ కొరడాను ఝుళిపించటం ఖాయమంటున్నారు. తాజాగా ఢిల్లీ ఐఐటీలో తీసుకున్ననిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా అన్ని ఐఐటీలతో పాటు.. అన్నివిద్యాసంస్థల్లోనూ చేపడితే బాగుంటుంది. రూల్స్ అన్నవి కేవలం విద్యార్థులకే కాకుండా.. విద్యాసంస్థల్లో పనిచేసే బోధనా సిబ్బందితో పాటు.. బోధనేతర సిబ్బంది సైతం ఇదే విధానాన్ని అమలు చేస్తే ప్రయోజనం ఉంటుంది. అందుకు భిన్నంగా విద్యార్థులకు ఒక రూల్.. సిబ్బందికి మరో రూల్ పెడితే మాత్రం.. ఈ నిబంధన పక్కాగా అమలయ్యే ఛాన్సే ఉండదని చెప్పక తప్పదు.