వాటి వల్ల కరోనా చావదు : డబ్ల్యూహెచ్.ఓ

Update: 2020-05-17 15:25 GMT
కరోనా వైరస్ ఫలానా చోట ప్రబలితే.. ఓ వ్యక్తికి పాజిటివ్ అని తేలితే చాలు.. మన మున్సిపాలిటీ వాళ్లు ట్యాంకర్ల కొద్దీ  క్రిమిసంహారక మందులు తెచ్చి వీధి వీధి అంతా స్ప్రే చేసేస్తారు. కరోనా కట్టడిలో భాగంగా బయట కరోనా ఉంటే చస్తుందని ఇలా చేశామంటారు. కానీ నిజంగా ఇలా స్ప్రే చేస్తే కరోనా చస్తుందా? స్ప్రే తో కరోనా అరికట్టవచ్చా అన్న సందేహాలు చాలా మంది లో ఉన్నాయి.

తాజాగా దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్.ఓ) అధికారికంగా స్పందించింది. కరోనా సోకిన ఏరియాల్లో క్రిమి సంహారక మందులు  స్ప్రే చేయడం వల్ల ఫలితం శూన్యమని స్పష్టం చేసింది.

చైనా సహా పలు దేశాల్లో కరోనా సోకిన నగరాల్లోని వీధుల్లో యథేచ్ఛగా స్ప్రే  వాడుతున్నారని.. దీని వల్ల కరోనా చావకపోగా.. మనుషుల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయని డబ్ల్యూ.హెచ్.ఓ హెచ్చరించింది.

స్ప్రే లో ఉండే క్లోరిన్ వంటి రసాయనాలను నేరుగా ప్రయోగిస్తున్నారని.. దాని వల్ల శారీరక , మానసిక సమస్యలు వస్తాయని పేర్కొంది.


Tags:    

Similar News