జల్సాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండి..బ్యాంకులకు 9 వేల కోట్లు ఎగనామం పెట్టి దేశం విడిచి పారిపోయిన లికర్ కింగ్ విజయ్ మాల్యా కోసం భారతదేశం తన పరిధిలో ఉన్న మార్గాలన్నింటినీ అన్వేషిస్తోంది. ఆయన్ను రప్పించేందుకు దౌత్యమార్గంలో ప్రయత్నంచేస్తూనే...ఇంకో మార్గాన్నికూడా భారత్ సిద్ధం చేసింది. ``మాల్యా కోసం జైలు సిద్ధంగా ఉంది. అది కూడా అన్ని ప్రమాణాలను పాటిస్తూ ఉంది...మాల్యాను పంపించండి`` అంటూ విన్నవించనుంది. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలును మాల్యా కోసం సిద్ధం చేసినట్లు వచ్చే వారం బ్రిటిష్ కోర్టుకు ఇండియా చెప్పనుంది. జైలు సిద్ధంగా ఉందని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి అంటారా? దాని వెనుక పెద్ద కథే ఉంది.
లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టులో ఇటీవల మాల్యా కేసులో వాదనల సందర్భంగా `భారత్‌లోని జైళ్లలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో మాల్యాను అప్పగిస్తే ఆయన ప్రాణానికి హాని కలిగే ప్రమాదం ఉంది` అని మాల్యా తరఫు లాయర్లు కోర్టుకు చెప్పారు. దీంతో తమ జైల్లు బాగున్నాయని భారత ప్రభుత్వం తరఫున మాల్యా అప్పగింత కోసం వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ ద్వారా ఈ విషయాన్ని కోర్టుకు వెల్లడించాలని భారత్ భావిస్తోంది. డిసెంబర్ 4 నుంచి మాల్యా అప్పగింత కేసుపై కోర్టు విచారణ జరపనుంది. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు అత్యంత భద్రత ఉన్న జైలని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నదని ఇండియా కోర్టుకు చెప్పనుంది.
యూకేకు చెందిన ఓ బుకీని అప్పగించాల్సిందిగా ఇండియా కోరగా.. ఇప్పటికే ఫుల్లుగా ఉన్న ఢిల్లీలోని తీహార్ జైల్లో వేస్తే అతని మానవ హక్కులకు విఘాతం కలుగుతుందని చెబుతూ ఇదే కోర్టు ఆ వినతిని తిరస్కరించింది. అయితే ఇండియాలో జైళ్లు కూడా ప్రపంచంలోని వేరే దేశాల జైళ్లకు ఏమాత్రం తీసిపోవని ఈ సందర్భంగా కోర్టుకు ఇండియా చెప్పనుంది. ఇంతకీ ఈ ఆర్థర్ రోడ్ జైలు గుర్తుందా? ఇక్కడే బాలీవుడ్ నటుడు సంజయ దత్ కూడా అక్రమ ఆయుధాల కేసులో జైలు శిక్ష అనుభవించాడు. ఇక మాల్యాకు ప్రాణహాని అన్నది ఒట్టి పుకార్లేనని, ఖైదీల భద్రతకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని కూడా లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టుకు ఇండియా స్పష్టం చేయనుంది.