కొత్త నిర్ణయాల్ని చెప్పిన శక్తికాంత దాస్

Update: 2016-11-23 07:51 GMT
ప్రతి మూడు.. నాలుగు రోజులకు ఒకసారి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల్ని అధికారికంగా ప్రకటిస్తూ.. అందరికి సుపరిచితంగా మారిన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తాజాగా మరోసారి టీవీ తెరలపై దర్శనమిచ్చారు. ప్రధాని మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనంతరం.. ఆయన తరచూ టీవీల్లో దర్శనమిస్తున్నారు. రద్దు నేపథ్యంలో చోటు చేసుకుంటున్నపరిణామాలపై కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల్ని ఆయన ఎప్పటికిప్పుడు వెల్లడిస్తున్నారు.

తాజాగా ఆయన వెల్లడించిన నిర్ణయాల్ని చూస్తే..

= డెబిట్ కార్డు వినియోగించటం ద్వారా వేసే రుసుముల్ని పూర్తిగా ఎత్తి వేస్తున్నారు

= రైల్వేశాఖ ఆన్ లైన్ ట్రైన్ టికెట్ బుకింగ్ కు డిసెంబరు 31 వరకు సేవా రుసుము రద్దు

= ట్రాయ్ యూఎస్ ఎస్ డీ ఛార్జీలు రూ.1.50 నుంచి 50 పైసలకు తగ్గింపు

= ఈ వ్యాలెట్ల లో నగదు పరిమితి గతంలో ఉన్న రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంపు

= డిజిటల్ లావాదేవీలపై విధిస్తున్న సేవా రుసుము ఎత్తివేత

= దేశ వ్యాప్తంగాఉన్న1.55లక్ష పోస్టాఫీసుల్లో నగదు అందుబాటులోకి తీసుకొచ్చాం

= రూ.2వేలు.. రూ.500 కొత్త కరెన్సీలు అందరికి అందుబాటులోకి తీసుకొచ్చాం

= జిల్లా సహకరా బ్యాంకుల్లో నాబార్డు రూ.21వేల కోట్లు పంపాం

= రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు

= ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి ఆదేశాలు ఇచ్చాం

= ప్రభుత్వ ఉద్యోగులంతా డిజిటల్ బ్యాకింగ్ ఉపయోగించుకోవాలి

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News