చైనా పై సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన నోబెల్ గ్ర‌హీత‌

Update: 2020-04-20 23:30 GMT
క‌రోనా వైర‌స్ వెలుగులోకి వ‌చ్చిన అంశంపై ప్ర‌పంచంలోని చాలా దేశాలు చైనాను త‌ప్పు ప‌డుతున్నాయి. ఆ దేశం నుంచే క‌రోనా వైర‌స్ పుట్టుకువ‌చ్చింద‌ని.. ఉద్దేశ‌పూర్వ‌కంగా ఆ వైర‌స్‌ను సృష్టించార‌ని త‌దిత‌ర ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. స్వ‌యంగా అమెరికా అధ్యక్షుడు డొన‌ల్డ్ ట్రంప్ చైనాను టార్గెట్‌గా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చైనా, అమెరికా మ‌ధ్య ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు రేగుతున్నాయి. ఈ  క్ర‌మంలో ఓ నోబెల్ గ్ర‌హీత కూడా చైనానే త‌ప్పుబ‌ట్టారు. చైనా నుంచే ఆ వైర‌స్ వెలుగులోకి వ‌చ్చింద‌ని, అమెరికా చేస్తున్న ఆరోప‌ణ‌ల‌నే ఆయ‌న చేశాడు. ఈ సంద‌ర్భంగా ప‌లు సంచ‌ల‌న విష‌యాలు ఆయ‌న బయ‌ట‌పెట్టాడు.

చైనాలోని ఒక ప్రయోగశాలలో కరోనావైరస్ తయారు చేశార‌ని.. ఆ ల్యాబ్ నుంచే వైర‌స్ లీకై ఇప్పుడు ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ప్ర‌బ‌లించింద‌ని నోబెల్ గ్రహీత లూక్ మోంటాగ్నియర్ ఆరోపించారు. ఒక ప్ర‌ధాన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయ‌న కరోనా వైరస్ విష‌యం ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. అడవి జంతువుల నుంచి వుహాన్ తడి మార్కెట్‌కు వెళ్లిందని తాను నమ్మట్లేదని, అది అసాధ్యమ‌ని పేర్కొన్నారు. అయితే వుహాన్ ల్యాబ్ నుంచి మాత్రం వైరస్ బయటకు వచ్చిందని తెలిపారు. వూహన్‌లోని ప్రయోగశాల 2000 నుంచి కరోనా వైరస్‌ లు తయారు చేయ‌డంలో ప్రత్యేకత కలిగి ఉంద‌ని సంచ‌ల‌న విష‌యం చెప్పారు.

తన సహోద్యోగి, గణిత శాస్త్రజ్ఞుడు జీన్-క్లాడ్ పెరెజ్‌తో కలిసి, అతను కొత్త రకం కరోనా వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించి దానిపై ప‌రిశోధ‌న‌లు చేసినట్లు వెల్లడించారు. మనిషి రోగ నిరోధక శక్తికి సంబంధించిన వైరస్ భాగాన్ని ఈ జన్యువులో చేర్చారని వివ‌రించారు. ఈ అంశంలోనే తాను 2008లో వైద్య శాస్త్రం లో నోబెల్ బహుమతి అందుకున్నట్లు మోంటాగ్నియర్ గుర్తుచేశారు.

వాస్త‌వంగా క‌రోనా వైర‌స్ చైనాలోని వుహాన్ నేషనల్ బయోసేఫ్టీ ల్యాబొరేటరీ లో ఎయిడ్స్ వైరస్‌ కి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ తయారు చేస్తున్న క్ర‌మంలో ఓ ప్రమాదం జ‌రిగింది. ఆ ప్ర‌మాదంలోనే ఈ కొత్త వైరస్ పుట్టిందని క‌రోనా వైర‌స్ పుట్టుక‌ పై ర‌హాస్యాన్ని ఆయ‌న తెలిపారు.

ఎయిడ్స్‌ లో ఉండే జన్యువులు కరోనా వైరస్ జన్యువులు కొన్ని సేమ్ అని, ఎయిడ్స్ మూలకాలు, మలేరియా జెర్మ్ ఉన్నట్లు ఈ సంద‌ర్భంగా ఆ శాస్త్ర‌వేత్త వివ‌రించారు. దీని వ‌ల‌నే క‌రోనా వైరస్ సహజంగా పుట్టినట్లు చెప్ప‌డం లేదన్నారు. సార్స్ వైరస్‌లో జన్యువులు, HIVలో జన్యువులు కలిపి ఈ వైరస్‌ ని తయారు చేసి ఉండొచ్చనే చెప్పారు.  కరోనా వైరస్‌కి చాలా వరకు చెక్ పెడుతున్నది మలేరియా నివార‌ణ‌కు వాడే డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ వినియోగిస్తున్నార‌ని, అది ఎందుకంటే క‌రోనాలో కూడా మలేరియా క్రిమి లాంటిది ఉండడం వ‌ల‌న ఆ మందు వినియోగిస్తున్నార‌ని తెలిపారు.

ఇప్పుడు ఈయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. చైనా నిర్ల‌క్ష్యం, అజాగ్ర‌త్త‌తో ఇప్పుడు ప్ర‌పంచం బ‌ల‌వుతుంద‌ని స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే చైనాపై అమెరికా స‌హా మ‌రికొన్ని దేశాలు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. వారు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు తాజాగా మెంటాగ్నియ‌ర్ చేసిన ఆరోప‌ణ‌లు బ‌లం చేకూరుస్తున్నాయి.
Tags:    

Similar News