ప్రపంచం స్మార్టు ఫోన్ చుట్టూ తిరుగుతోంది.. అందుకే ఫోన్లకు క్రేజ్ సృష్టించుకోవడానికి ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు సంస్థలు. అందులో భాగంగా పొలిటికిల్ క్రేజ్ ను తమ బ్రాండ్ ఇమేజి కోసం వాడుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పొలిటికల్ ఫోన్లు మార్కెట్లలోకి వస్తున్నాయి. ఇండియాలో ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ పేరుతో ‘నమో’ బ్రాండు స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇతర దేశాల్లోనూ ఇలాంటి ట్రెండు మొదలయ్యేలా నోకియా వరుసగా పొలిటికల్ ఫోన్లు రిలీజ్ చేస్తోంది.
తాజాగా జర్మనీలోని హ్యాంబర్గ్ లో జరుగుతున్న జీ-20 సదస్సు సందర్భంగా నోకియా విడుదల చేసిన ఫోన్ అందరినీ ఆకట్టుకుంటోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ - అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిత్రాలతో నోకియా 3310 ఫోన్ ఒకటి రిలీజ్ చేసింది. దీనిపై బంగారు పూతతో వారి చిత్రాలు ఉన్నాయి. ఫోన్ బ్యాక్ కవర్ పై టైటానియం ప్లేట్ ను ఏర్పాటు చేసి అక్కడ ఈ బొమ్మలను ముద్రించి, దానిపై బంగారం పూత పూశారు. దీని ధరను 2,468 డాలర్లుగా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీ ప్రకారం ఈ ఫోన్ విలువ సుమారు 1.6 లక్షల రూపాయలు వరకు ఉంటుంది.
కాగా నోకియా గతంలోనూ పుతిన్ చిత్రంతో ఇలాంటి ప్రయోగం చేసింది. పుతిన్ చిత్రంతో ఒక స్పెషల్ ఫోన్ లిమిటెడ్ ఎడిషన్ రిలీజ్ చేయగా దానికి మంచి ఆదరణ వచ్చింది. దాంతో ఇప్పుడు సందర్భానుసారంగా మరోఅడుగు ముందుకేసి అమెరికా, రష్యాల అధ్యక్షులిద్దరి చిత్రాలతో ఈ లిమిటెడ్ ఎడిషన్ ను రిలీజ్ చేసింది.