కోర్టు ఆదేశాల్ని పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తే కోరి సమస్యల్ని కొని తెచ్చుకున్నట్లే. పలువురు ప్రముఖులు తమకున్న పవర్ నేపథ్యంలో కోర్టు ఆదేశాల్ని కొన్నిసార్లు పట్టించుకోకుండా ఇబ్బందుల్లో చిక్కుకుపోతుంటారు. తాజాగా ఆ తరహా జాబితాలోకి ఎక్కారు ఏపీ రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు.
మంత్రి గంటాకు అనకాపల్లి రెండో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జీవీవీ సత్యనారాయణ నాన్ బెయిలబుల్ వారెంట్ ను ఇష్యూ చేశారు. అప్పుడెప్పుడో 2009 ఎన్నికల సమయంలో గంటా అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ ఆయనపై ఫిర్యాదు చేశారు. అనంతరం కేసు నమోదు చేశారు.
దీనికి సంబంధించిన విచారణ అనకాపల్లి కోర్టులో జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి మంత్రి గంటా బుధవారం అనకాపల్లి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. మరి.. కారణం ఏమిటో కానీ ఆయన కోర్టుకు హాజరు కాలేదు. దీంతో.. విచారణకు రాని నేపథ్యంలో మంత్రి గంటాకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను ఇష్యూ చేశారు. కోర్టుకు ఆగ్రహం కలగకుండా ప్రముఖులు జాగ్రత్తలు తీసుకోరెందుకో?