ఉత్తరకొరియా వివాదాస్పద నేత కిమ్ జాంగ్ ఉన్ హత్యకు అమెరికా కుట్ర పన్నినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అమెరికా - దక్షిణ కొరియా దేశాలకు చెందిన ఏజెంట్లు కిమ్‌ను హతమార్చేందుకు ప్రణాళికలు వేసినట్లు ఉత్తర కొరియా తెలిపింది. దీనికి సంబంధించి నార్త్ కొరియా ఇవాళ ఓ ప్రకటన చేసింది. ఈ మేరకు తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది.
అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం సీఐఏ - దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్‌లు కలిసికట్టుగా ఓ ఉగ్రవాద గ్రూపుతో కిమ్ ను చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు నార్త్ కొరియా భద్రతా మంత్రి వెల్లడించారు. అయితే ఆ ఉగ్ర గ్రూపును నిర్ధాక్షిణ్యంగా ధ్వంసం చేయనున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో నార్త్ కొరియా తాజాగా ఈ ఆరోపణలు చేసింది. జీవరసాయనిక పదార్ధాలతో కిమ్‌ను హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు నార్త్ కొరియా ఏజెన్సీ కేసీఎన్ఏ పేర్కొన్నది. జీవరసాయన పదార్ధాలు, రేడియోధార్మిక పదార్ధాలు, నానో విషపూరిత పదార్ధాలతో దాడికి కుట్ర జరిగినట్లు నార్త్ కొరియా వెల్లడించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/