ఉత్తరకొరియా - అమెరికా రథసారథలు మధ్య వాదోపవాదాలు - ప్రతిసవాళ్లతో యుద్ధం అనివార్యమనే భావన - భయం ప్రపంచవ్యాప్తంగా కలుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దుష్టుడని - అమెరికాపై దాడి తప్పదని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్ తీవ్ర స్వరంతో విరుచుకుపడగా....ఉత్తర కొరియా నేతలను తుడిచేస్తామంటూ ట్రంప్ కూడా నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్ లో అమెరికాకు వ్యతిరేకంగా శనివారం భారీ ర్యాలీ జరిగింది. మరోవైపు కొరియా గగనతలంపై అమెరికా బాంబర్ విమానం చక్కర్లు కొట్టింది.
ఈ నేపథ్యంలో అసలు యుద్ధం వస్తే పరిస్థితి ఏంటనేది అందరిలో నెలకొంది. ఈ ఉత్కంఠను కూడా ప్రజలకు ఎందుకు కలిగించాలి..క్లారిటీ ఇస్తే పోలా అనుకుందో ఏమో కానీ....యుద్ధం వస్తే ఏం జరుగుతుందో చెప్తూ ఉత్తరకొరియా ఓ వీడియోను విడుదల చేసింది. ఒకటిన్నర నిమిషం నిడివి గల ఈ వీడియోలో....ట్యాంపర్ చేసిన ఫొటోలతో అమెరికా జెట్ విమానాలను ఉత్తరకొరియా క్షిపణితో కూల్చివేసినట్లుగా ఉంది. ఉత్తరకొరియా తూర్పు తీరంలోని అంతర్జాతీయ వైమానిక ప్రాంతంలో శనివారం అమెరికా వైమానిక దళానికి చెందిన బీ-1బీ లాన్సర్ బాంబర్ విమానాలు చక్కర్లు కొట్టిన తర్వాత ఉత్తరకొరియా ఈ వీడియో విడుదల చేయడం గమనార్హం. తద్వారా అమెరికాను రెచ్చగొట్టడం ఆ దేశ పౌరుల్లో భయం సృష్టించడమే లక్ష్యమని అంటున్నారు.
మరోవైపు ఉత్తరకొరియా సరిహద్దుల్లో బలగాల ప్రదర్శన.. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైన్యం శక్తిసామర్థ్యాలను సూచిస్తున్నదని అమెరికా తెలిపింది. ఉత్తర - దక్షిణకొరియా విడిపోయాక ఇరుదేశాల సరిహద్దులో అమెరికా యుద్ధవిమానాలు ఆకాశంలో కనిపించడం 21వ శతాబ్దంలో ఇదే తొలిసారని పెంటగాన్ పేర్కొంది.
మరోవైపు గత వారాంతంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ - ఆ దేశ విదేశాంగమంత్రి రి యాంగ్ లను ట్రంప్ ఘాటుగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కొరియా రాజధాని ప్యాం గ్యాంగ్ లోని కిమ్ ఇల్ సంగ్ స్కేర్ వద్ద అమెరికాకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్న దృశ్యాలను ఆ దేశ టీవీ చానెల్ కేఆర్టీ ప్రసారం చేసింది. ``ప్రపంచం నుంచి అమెరికాను, దుష్ట అధ్యక్షుడిని తొలిగించేందుకు ఆ దేశంతో అంతిమ యుద్ధం చేసేందుకు మంచి సమయం కోసం వేచిచూస్తున్నాం. కిమ్ ఆదేశిస్తే ఆక్రమణదారులను అంతమొందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం`` అని కొరియా రెడ్ గార్డ్స్ కమాండింగ్ అధికారి రీ ఇల్ బే అన్నట్టు కేసీఎన్ ఏ వార్తా సంస్థ తెలిపింది.
Full View