ట్రంప్ టీంలోని ఆ భార‌తీయ అమెరిక‌న్...ఓ వేశ్య‌

Update: 2017-09-09 11:07 GMT
త‌న మూర్ఖ‌పు, మొండి చేష్ట‌ల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న ఉత్త‌రకొరియా మ‌రింత బ‌రితెగించింది. అణు ప‌రీక్ష‌ల‌తో ఇటీవ‌ల ఉత్త‌ర కొరియా హ‌డ‌లెత్తిస్తున్న విష‌యం తెలిసిందే. దానికి కొన‌సాగింపుగా అన్న‌ట్లేమే కానీ....ఇప్పుడు ఆ దేశం అనుచిత వ్యాఖ్య‌ల‌తో నీచ‌పుబుద్ధిని ప్ర‌ద‌ర్శించుకుంటోంది. ఐక్య‌రాజ్య‌స‌మితిలో అమెరికా రాయ‌బారిగా ఉన్న భార‌త సంత‌తి మ‌హిళ‌ నిక్కీ హేలీని తీవ్ర అస‌భ్య ప‌దజాలంతో కామెంట్ చేసింది.  ప‌దేప‌దే అణు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న నార్త్ కొరియాపై క‌ఠిన‌మైన ఆంక్ష‌లు విధించాల‌ని తాజాగా ఐక్య‌రాజ్య‌స‌మితిలో అమెరికా రాయ‌బారి నిక్కీ హేలీ డిమాండ్ చేశారు. అయితే ఆమె చేసిన ప్ర‌తిపాద‌న‌ల ప‌ట్ల ఉత్త‌ర కొరియా సీరియ‌స్ అయ్యింది. అగ్ర‌రాజ్యం అమెరికా అంబాసిడ‌ర్‌ ను దారుణంగా తిట్టేసింది.

త‌న ఆవేశాన్ని దుర్మార్గ‌పు ప‌దంతో విమ‌ర్శించింది. అమెరికా రాయ‌బారి ఓ వేశ్య‌లాగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఉత్త‌ర కొరియా కామెంట్ చేసింది. కొరియాకు చెందిన సెంట్ర‌ల్ న్యూస్ ఏజెన్సీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ``ట్రంప్ ప్ర‌భుత్వంలో ఆమె ఓ కీల‌క వ్య‌క్తి, త‌న ప్ర‌మేయంతో ఒత్తిళ్ల‌ను తీసుకువ‌స్తోంది, లేనిపోని ఆంక్ష‌లు విధిస్తోంది, ఆమె ఓ వేశ్య`` అంటూ కొరియా ఏజెన్సీ త‌న రిపోర్ట్‌లో పేర్కొంది. రాయ‌బారి నిక్కీ త‌న నోరును జాగ్ర‌త్త‌గా అదుపులో పెట్టుకోవాల‌ని, ఆమె ఏదిప‌డితే అది మాట్లాడితే అమెరికా దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నార్త్ కొరియా హెచ్చ‌రించింది. కొరియా త‌న అణు ప‌రీక్ష‌ల‌తో యుద్ధాన్ని ఆహ్వానిస్తుంద‌ని ఇటీవ‌ల నిక్కీ ఐక్య‌రాజ్య‌స‌మితిలో కామెంట్ చేశారు. క‌ఠిన‌మైన ఏడు ఆంక్ష‌లు విధించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న నార్త్ కొరియా ఆమెపై ఘాటైన ప‌ద‌జాలంతో తిట్టిపోసింది.

కాగా, నిరాయుధీకరణపై ఐక్యరాజ్యసమితి సదస్సులో ఉత్తర కొరియా రాయబారి హాన్ టే సాంగ్ మాట్లాడుతూ, `మా దేశం రెండు రోజుల క్రితం హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించిందని చెప్పేందుకు గర్విస్తున్నాను` అని అన్నారు. తమ దేశ ఆత్మరక్షణ చర్యలు అమెరికాకు గిఫ్ట్ ప్యాకేజ్ వంటివని చెప్పారు. ఉత్తర కొరియాపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలను, రెచ్చగొట్టే చర్యలను అమెరికా కొనసాగించినంతకాలం ఆ దేశం తమ నుంచి గిఫ్ట్ ప్యాకేజీలు అందుకుంటూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌ను కూడా హేలీ త‌ప్పుప‌ట్టారు.
Tags:    

Similar News