ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాపై నిప్పులు చెరుగుతున్న ఉత్తరకొరియా తన ఆగ్రహాన్ని పాకిస్తాన్ పై ఎక్కుపెట్టింది. ఏకంగా బెదిరింపులకు దిగింది. ఎందుకు ఇంత ఆగ్రహం అంటే...తన దేశానికి చెందిన రాయబారిపై దాడి జరగడమే ఉత్తర కొరియాకు మంటకు కారణం!పాకిస్థాన్ లో ఉత్తర కొరియా రాయబారి - అతడి భార్యపై పన్నుశాఖ అధికారులు ఇంటికెళ్లి మరీ దాడి చేశారు. ఉత్తరకొరియా అభిప్రాయం ప్రకారం పాక్ పన్నుశాఖకు చెందిన పదిమంది అధికారులు ఆయుధాలు ధరించి కరాచీలోని ఉత్తర కొరియా రాయబారి ఇంటికి వెళ్లి రాయబారిపై దాడి చేయడమే కాకుండా అతడి భార్యను జుట్టుపట్టుకొని ఈడ్చి ఇద్దరిని కొట్టారు. వారి తలపై తుపాకులు ఎక్కు పెట్టి తీవ్రంగా అవమానించారు. అంతటితో ఆగకుండా గోడకు ఉన్న ఫొటోలపై కాల్పులు జరిపారు. ఏప్రిల్ 9న జరిగిన ఈ ఘటన దాదాపు నెల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తమ రాయబారి నివాసంపై దాడిని తీవ్రంగా భావించిన ఉత్తర కొరియా అంతర్గత వ్యవహారాల మంత్రి పాక్‌కు తీవ్ర హెచ్చరిక లేఖ రాశారు. చర్యలకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోకుంటే మాత్రం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందని, కచ్చితంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. ఇప్పటికే తాము ఉన్నత స్థాయి కమిటీని వేశామని, అరెస్టు చేయకుంటే మాత్రం తామే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించి తమకు నచ్చిన చర్యలు తీసుకుంటామని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. ఇదిలాఉండగా...దాడికి గురైన రాయబారి నిర్వహిస్తున్న విధుల వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/