కొద్ది రోజులుగా అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. గువామ్ దీవిపై దాడి చేసేందుకు కిమ్ ప్రణాళికలు రచిస్తున్నాడన్నా ఆరోపణలతో అమెరికా కూడా దూకుడుగా వ్యవహరించేందుకు పావులు కదుపుతోంది. అమెరికా ప్రోద్బలంతో ఐక్యరాజ్యసమితి...ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించింది. దీంతో, కిమ్ తన వ్యూహాన్ని మార్చారు. ఆ ఆంక్షల సడలింపునకు కిమ్ తనవంతుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. తన శత్రుదేశమైనా అమెరికా, అధ్యక్షుడు ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు ఇతర దేశాలకు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటివరకు మిస్సైల్స్ ను నమ్ముకున్న కిమ్ ఇకపై లేఖలను నమ్ముకోవాలని భావిస్తున్నారు. తమకు మద్ధతుగా, అమెరికాకు వ్యతిరేకంగా నిలవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరుతూ ఓ లేఖ రాశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ దేశానికి ముప్పుపెరిగిందని, తమ దేశంపై దాడి చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని, యుద్దం కూడా ప్రకటించిందని కిమ్ ఆ లేఖలో పేర్కొన్నారు. కిమ్ అనూహ్యంగా ఆస్ట్రేలియాను ఆశ్రయించడం, అంతేకాకుండా ఏకంగా ఓ లేఖ రాయడం సంచలనం రేపింది.
డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఫారెన్ ఎఫైర్స్ కమిటీ నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఈ లేఖ వచ్చింది. ఐక్యరాజ్యసమితి తమ దేశంపై విధించిన ఆంక్షలు సడలించేందుకు సహకరించాలని కిమ్ కోరారు. అమెరికాతో యావత్ ప్రపంచానికే ముప్పు పొంచి ఉందని అభివర్ణించారు. ప్రపంచాన్ని భయంకరమైన అణుయుద్ధ ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నాన్ని అమెరికా చేస్తోదంటూ దుయ్యబట్టారు. తమ దేశానికి అంతర్జాతీయ న్యాయం జరగాలని ఆకాంక్షించారు. కిమ్ రాసిన లేఖలోని విషయాలను ఆస్ట్రేలియా విదేశాంగశాఖ మంత్రి జూలీ బిషప్ వెల్లడించారు. ఆ లేఖను ఫెయిర్ ఫాక్స్ వార్తా సంస్థ ప్రచురించింది. అమెరికా విషయంలో తాను ఒంటరిననే ఆందోళన కిమ్ మనసులో ఉందని జూలీ బిషప్ పేర్కొన్నారు. కిమ్ ఈ ఒక్క లేఖకే పరిమితం కారని, దాదాపు అన్ని దేశాల ప్రభుత్వాలకు లేఖలు రాసే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా పోరాడాలని మిగిలిన దేశాలకు కిమ్ పిలుపునిచ్చే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.