అగ్రరాజ్యం అమెరికాను మరోమారు లిటిల్ రాకెట్ మ్యాన్ కిమ్ జోంగ్ ఉన్ వణికించనున్నాడా?అందులోనూ అమెరికన్లు ఆనందంగా ఉన్న రోజును ఎన్నుకోనున్నారా? ఈ నెల 9వ తేదీ.. అమెరికాకు కిమ్ మరో హెచ్చరిక జారీ చేయనున్నారా? ఎప్పట్లాగే..తనకు నచ్చిన అణుక్షిపణులతో ఈ హెచ్చరిక చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మరింత శక్తివంతమైన అణుక్షిపణి ప్రయోగించి ప్రపంచానికి ఆ రోజున తన సత్తా చాటేందుకు కిమ్ సన్నద్ధమవుతున్నాడని అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏడాది అక్టోబర్ రెండో సోమవారం రోజున అమెరికన్లు `కొలంబస్ డే`గా జరుపుకొంటున్న సమయంలోనే ఆ రోజున ఖచ్చితంగా కిమ్ ఏదొక భారీ విస్పోటనానికి వ్యూహం సిద్ధం చేసే ఉంటారని సీఐఎ కూడా సందేహిస్తోంది.
అక్టోబర్ 9వ తేదీనే కిమ్ ఎంచుకునే అవకాశం ఉండటానికి కూడా ఆసక్తికరమైన కారణాలు చెప్తున్నారు. సముద్ర నావికుడు కొలంబస్ 1492 అక్టోబర్ 12న తొలిసారిగా అమెరికా గడ్డపై కాలుమోపాడు. ఆ రోజు సోమవారం...అప్పటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 2వ సోమవారం నాడు దేశం యావత్ ఉత్సవాలు నిర్వహించుకోవడం సంప్రదాయంగా మారింది. ఆ రోజున దేశమంతా సెలవిస్తారు. ప్రభుత్వపరంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సరిగ్గా అదే రోజున కిమ్ అణ్వస్త్ర ప్రయోగం చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇది కేవలం అంచనా కాకపోవడం గమనార్హం. ఇంతతవరకు ఉత్తరకొరియా ఐదుసార్లు అణ్వస్త్ర ప్రయోగాలు నిర్వహించింది. ఇవి చేపట్టిన ప్రతి రోజు కూడా అమెరికా చరిత్రతో సంబంధమున్న రోజే. తొలిసారిగా 2006 అక్టోబర్ 9న 310 మీటర్ల లోతున భూమిలో ఉత్తరకొరియా అణ్వాయుధ పరీక్షలు నిర్వహిం చింది. 2006 అక్టోబర్ 9 కూడా రెండో సోమవారమే వచ్చింది. ఆ రోజున కొలంబస్ డేగా అమెరికన్లు జరుపుకున్నారు. 2009 మే 25న రెండో ప్రయోగం నిర్వహించారు. ఈసారి కూడా భూమి లోపలి పొరల్లో 490మీటర్ల అడుగున ఈ ప్రయోగాన్ని ఉత్తరకొరియా నిర్వహించింది. మే 25నే అమెరికా రాజ్యాంగం అమల్లోకొచ్చింది. ఆ తర్వాత 2013 ఫిబ్రవరి 12న మూడో ప్రయోగం జరిగింది. అది అమెరికా దివంగత అధ్యక్షుడు అబ్రహం లింకన్ పుట్టిన రోజు. ఆ తర్వాత 2016 జనవరి 6న నాలుగో ప్రయోగం నిర్వహించారు. అది చైనాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని బ్రిటన్ ప్రభుత్వం గుర్తించిన రోజు. యూఎస్ అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ దివంగతుడైన రోజు కూడా అదే. ఆ తర్వాత 2016 సెప్టెంబర్ 9న మరో ప్రయోగం చేశారు. చైనా, జపాన్‌ల మధ్య 1945లో జరిగిన యుద్ధంలో జపాన్ సైన్యం చైనాకు లొంగిపోయిన రోజది.
ఇలా ప్రయోగం చేపట్టిన ప్రతి తేదీ కూడా ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో జపాన్ లేదా అమెరికా - బ్రిటన్ లకు సంబంధించి ఏదొక ప్రాధాన్యత కలిగిన రోజే. తొలి ప్రయోగమైతే కొలంబస్ డే రోజునే నిర్వహించారు. ప్రస్తుతం ఇరుపక్షాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకునున్నాయి. అటు ట్రంప్, ఇటు కిమ్ ఇద్దరూ మాటలదాడులు పెంచారు. అంతర్జాతీయ సమాజం భయపడుతున్నప్పటికీ వీరిద్దరూ మాత్రం వెనుకడుగు వేయడంలేదు. ఈ దశలో కొలంబస్ డే రోజున కిమ్ ఖచ్చితంగా తన ఉనికి ప్రదర్శన కోసమైనా అమెరికన్లను భయపెట్టే చర్యకొడిగడతారని నిఘా వర్గాలు ముందస్తు అంచనాలకొచ్చాయి.