ఉత్తర కొరియా అధ్యక్షుడి సోదరుడి హత్యలో సంచలన నిజాలు

Update: 2019-06-12 07:38 GMT
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. నరరూప రాక్షసుడిగా పేరుపొందాడు. తాను అధ్యక్షుడిగా ఉండి నిరంకుశంగా పాలించాడు. తనకు పోటీగా ఉన్న కుటుంబ సభ్యులను తోబుట్టువులను, బంధువులను చాలా మందిని చంపించేసిన కరుడుగట్టిన ఉన్నాది నేత ఈయన.. అయితే తాజాగా సోదరుడిని కూడా చంపించాడని తెలియడంతో అంతా నివ్వెరపోయారు.

2017లో  ఉత్తర కొరియా  అధ్యక్షుడు కిమ్  జాంగ్ ఉన్ సవితి సోదరుడు కిమ్ జాంగ్ నామ్ హత్యకు గురయ్యాడు. అయితే అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి నామ్ కొరియర్ గా పనిచేసి ఉత్తర కొరియా రహస్యాలను చేరేవేసేవాడని తెలిసింది.దీంతో కిమ్ జాంగ్ అతడిని చంపడానికి స్కెచ్ గీశాడు. చైనా- అమెరికా ఏజెన్సీలతో సవితి సోదరుడు పనిచేస్తున్నాడని నిర్ణారించుకున్నాక కిమ్ హత్యకు ప్లాన్ చేయగా.. అది తెలిసిన సోదరుడు  నామ్ ఉత్తరకొరియా వదిలి పారిపోయాడు.

2017లో డబ్బులు కొరత ఏర్పడడంతో ఎట్టకేలకు మలేషియాకు వెళ్లాడు. అక్కడ అమెరికా- చైనా ఇంటెలిజెన్స్ రక్షణ ఇచ్చినా రిస్క్ అని చెప్పినా మలేషియాకు వెళ్లడమే నామ్ చేసిన పెద్ద తప్పు. అతడికోసం వెతుకుతున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్.. తన సోదరుడు కౌలంలపూర్ ఎయిర్ పోర్టులో ఉన్నాడని కనుగొని ఇంద్దరు మహిళల సాయంతో అతడికి విషం ఇచ్చి చంపించాడు.

తాజాగా నామ్ ను చంపించిన వ్యవహారం వెలుగుచూడడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించాడు. నిజంగా నామ్ ఉత్తర కొరియా అధ్యక్షుడికి సోదరుడు అని తెలియదని.. తెలిసి ఉంటే అతడిని తాము ఏజెంట్ గా పెట్టుకునే వాళ్లం కాదని పేర్కొన్నారు. ఇలా అధికారానికి అడ్డుగా వస్తాడనుకున్న అందరినీ కిమ్ చంపించడం చర్చనీయాంశంగా మారింది.

    

Tags:    

Similar News