ఈ భూమ్మీద సంతోషం ఎక్కడ ఉందో తెలుసా? ఏ దేశ ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారో తెలుసా? ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఈ భూమ్మీద అత్యంత సంతోషకరమైన దేశం నార్వే. తాజాగా విడుదలైన రిపోర్ట్ లో ఈ విషయం వెల్లడైంది. పొరుగు దేశం డెన్మార్క్‌ను బీట్ చేసిన నార్వే హ్యాపినెస్ లో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ఎందుకు వాళ్ల అంత సుఖంగా ఉన్నారన్న కోణంలో నిర్వహించిన సర్వే ఆధారంగా నార్వే ప్రజలు అత్యంత ఆనందభరితులను తెలిసింది. నార్వే - డెన్మార్క్ - ఐస్ ల్యాండ్ - స్విట్జర్లాండ్ - ఫిన్ లాండ్ దేశాలు టాప్ ఫైవ్ స్థానాల్లో ఉన్నాయి. ఇక ఆ జాబితాలో సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ చివరి స్థానంలో ఉంది.
పశ్చిమ యూరోప్ - ఉత్తర అమెరికా దేశాలు హ్యాపినెస్ టేబుల్ లో అగ్రస్థానంలో నిలిచాయి. ఆ జాబితాలో అమెరికా 14వ, బ్రిటన్ 19వ స్థానాల్లో ఉన్నాయి. సబ్ సహారా ఆఫ్రికా దేశాలు మాత్రం హ్యాపినెస్ స్కోరింగ్ లో వెనుకబడ్డాయి. అంతర్యుద్దంతో సతమతమవుతున్న సిరియా 152వ స్థానంలో నిలిచింది. మార్చి 20న ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపినెస్ ను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ ను విడుదల చేశారు.
మరోవైపు అగ్రదేశం అమెరికాలో సంతోషకర సందర్భాలు తగ్గిపోతున్నాయట. అమెరికా ఆర్థికంగా బలపడుతున్నా, ఆ దేశ ప్రజల్లో ఆనందం కరువవుతున్నదని రిపోర్ట్ పేర్కొన్నది. సామాజిక రుగ్మతలను రూపుమాపితేనే అమెరికాలో మళ్లీ హ్యాపినెస్ లెవల్స్ మెరుగవుతాయని నివేదిక స్పష్టం చేసింది. అసమానతులు, అవినీతి వల్లే అక్కడ సంతోషం కరువైనట్లు తెలుస్తున్నది. ప్రెసిడెంట్ ట్రంప్ విధానాల వల్ల అమెరికా ప్రజల ఆనందం మరింత క్షీణిస్తుందని రిపోర్ట్‌ను తయారు చేసిన జెఫ్రీ సాచ్స్ తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/