ఒడ్డున ఉన్నోడు ఎన్ని మాటలైనా చెబుతాడు. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల మాటలు కూడా ఇంచుమించు ఇలానే ఉన్నాయని చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు.. దగ్గర దగ్గర నెల రోజుల నుంచి జ్వరాల బారిన పడిన హైదరాబాద్ మహానగరం అతలాకుతలమవుతోంది. జ్వరాలు అందునా డెంగీతో నగర జీవులు విలవిలలాడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ రోజుకు వందలు దాటి వేలల్లోకి వెళుతుందంటే తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తుంది.
ఇక.. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ డెంగీ సమస్య అంతకంతకూ పెరగటమే కానీ తగ్గకపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటివేళ.. వైద్య ఆరోగ్య శాఖ ఫెయిల్ అయ్యిందన్న మాట పలువురి నోట వినిపిస్తుంటే.. అలాంటి మాటలు అనొద్దంటూ ఈటెల వ్యాఖ్యానించటం గమనార్హం.
జంట నగరాల్లో విష జ్వరాలు పెరుగుతున్న మాట వాస్తవమే కానీ.. ఆ విషయానికి పానిక్ కావొద్దని వ్యాఖ్యలు చేయటం విశేషం. ఇన్నేసి రోజులుగా జ్వరాల తీవ్రత నగరంలో అంతకంతకూ పెరుగుతూ.. లక్షలాది మంది ఇబ్బందులకు గురి అవుతున్న వేళ కూడా పానిక్ కాకుండా ఉండొద్దని ఈటెల ఎలా చెబుతారన్నది ప్రశ్న.
ఇదిలా ఉంటే.. పెరుగుతున్న వ్యాధులకు తగ్గట్లు చికిత్స చేయటంలో సర్కారు ఫెయిల్ కావటం తప్పన్నారు. కొందరు గిట్టని వారు నెగిటివ్ కామెంట్స్ చేస్తారన్న ఆయన.. సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచినరెండు రోజులుగా తాను పలువురితో మాట్లాడుతున్నానని.. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు వైద్య ఆరోగ్య శాఖ 24 గంటలూ పని చేస్తుందన్నారు.
డెంగ్యూ మరణాల మీద వస్తున్న వార్తల్ని కొట్టిపారేసిన ఆయన 2017లో కూడా పెద్ద ఎత్తున డెంగ్యూ జ్వరాలతో నగర ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు డెంగ్యూ తీవ్రత తక్కువగా ఉందన్నారు. అనకూడదు కానీ.. గడిచిపోయిన కాలం.. అందునా రెండేళ్ల నాటి ముచ్చట్లు ఇప్పుడు గుర్తుండలేని పరిస్థితి. ఇలాంటప్పుడు అప్పుడు తీవ్రత ఎక్కువ.. ఇప్పుడే తక్కువని చెప్పటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని చెప్పక తప్పదు. వ్యాధులు తీవ్రతను తగ్గించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పని చేస్తున్నట్లు ఈటల చెప్పారు. మొత్తానికి తనదైన మాటలతో డెంగూ జ్వరాలు నగరంలో ప్రమాదకర పరిస్థితేమీ లేదన్న అర్థం వచ్చేలా మాట్లాడిన రాజేందర్ మాటల్ని చూస్తుంటే.. పెద్ద సారు కు జ్వరాల మీద గుస్సా రాకుండా ఉండేలా ఈటల మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.