వైసీపీలో చేరడం లేదు.. ఎమ్మెల్యే క్లారిటీ

Update: 2021-03-03 14:14 GMT
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారంటూ ప్రతిరోజూ ప్రచారం సాగుతుంటుంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన జగన్ పార్టీ లో చేరుతారని జోరుగా ఊహాగానాలు వస్తాయి. తాజాగా కూడా వచ్చాయి. వాటిపై గంటా మరోసారి ఈరోజు స్పందించారు.

తాను వైసీపీలో చేరబోతున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తాజాగా స్పందించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని.. ఆయన ఎలాంటి లక్ష్యంతో మాట్లాడారో అర్థం కావడం లేదని ట్వీట్ చేశారు.తాను ఎటువంటి ప్రతిపాదనలు పంపానో విజయసాయి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు 100 సార్లకు పైగా ఇలాంటి ప్రచారాలు వచ్చాయని.. అన్ని అసత్యాలేనని స్పష్టం చేశారు.

ఈరోజు టీడీపీ నేత, గంటా ప్రధాన అనుచరుడు అయిన కాశీ విశ్వనాథ్ వైసీపీలో ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో చేరారు. కాశీ విశ్వనాథం వైసీపీలో చేరడం సంతోషమని విజయసాయిరెడ్డి అన్నారు. అయితే ఈయన బాటలోనే గంటా కూడా చేరుతాడని..  కొన్ని కండీషన్లు పెట్టాడని.. అవి జగన్ ఆమోదిస్తే చేరుతాడనే ప్రచారం సాగుతోంది.

గంటా ప్రధాన అనుచరుడు రాకను మంత్రి అవంతి శ్రీనివాస్ జీర్ణించుకోవడం లేదని.. అందుకే ఈ చేరిక కార్యక్రమానికి అవంతి దూరంగా ఉన్నారన్న ప్రచారం విశాఖలో జోరుగా సాగుతోంది. ట్విస్ట్ ఏంటంటే ఈ చేరిక అనంతరం గంటా అనుచరుడు కాశీ విశ్వనాథం మీడియాతో మాట్లాడారు. మంత్రి అవంతిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుంటానని తెలిపాడు.  గంటా పార్టీ మార్పుపై వచ్చిన ఊహాగానాలకు తాజాగా ఆయన వ్యాఖ్యలతో తెరపడింది.
Tags:    

Similar News