మోడీ ప్రధానమంత్రి అయితే వ్యవస్థ మొత్తం మారకున్నా.. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ హయాంలో ఉన్న దరిద్రాలు చాలావరకూ పోతాయన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు అదే మాటను చెప్పేటోళ్లు చాలామందే కనిపిస్తారు. మోడీ హయాంలో అవినీతి అన్నది లేదని.. ఎలాంటి కుంభకోణాలు చోటు చేసుకోవటం లేదన్న వాదనను పలువురు వినిపిస్తూ ఉంటారు. నిజంగానే దేశంలో అవినీతి తగ్గిందా? అన్నది బహిరంగ రహస్యం.
అవినీతి సంగతి పక్కన పెట్టేద్దాం. నీతిగా.. నిజాయితీగా పని చేసే సీనియర్ అధికారులకు ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. మన్మోహన్ అయినా మోడీ అయినా ఒకటే బహుమతి అన్నట్లుగా పరిస్థితి మారింది. నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ గా..సిన్సియర్ ఐఏఎస్ అధికారిగా పేరున్న అశోక్ ఖేమ్కా ఉదంతాన్నిచూస్తే విషయం ఇట్టే అర్థమైపోతుంది. 1991 బ్యాచ్ కు చెందిన అయన.. ఇప్పటివరకూ జస్ట్ 50 సార్లు మాత్రమే బదిలీ అయ్యారు.
ఇలాంటి అధికారుల ఉదంతాలు గతంలో మీడియాలో వస్తే.. మోడీ ప్రధానమంత్రి అయితే ఇలాంటివారికి సముచితమైన గౌరవం దక్కటమే కాదు కీలకమైన స్థానాల్లోకి వస్తారన్న భరోసా మాటలు చాలానే వినిపించేవి. ఆయన విధులు నిర్వహించే హర్యానా రాష్ట్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. అయినప్పటికీ ఆయనకు బదిలీ వేటు బహుమానం తప్పట్లేదు.
వరుస పెట్టి బదిలీ వేట్లు వేసే ఆయనకు మోడీ రాజ్యంలోనూ అలాంటి బహుమతులే లభిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలోనే హర్యానా రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసిన ఆయన్ను మరోసారి బదిలీ వేటు వేశారు. తాజాగా ఆయన్ను రాష్ట్ర ఆర్కియాలజీ మ్యూజియం విభాగ ముఖ్య కార్యదర్శిగా ట్రాన్సఫర్ చేశారు. అశోక్ తో పాటు మరో ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేశారు.
ఎప్పుడు బదిలీలు జరిగినా.. కచ్ఛితంగా ఉండే పేర్లలో అశోక్ ఖేమ్కా పేరు తప్పనిసరి అంటారు.
గతంలో మాదిరి తనపై వేస్తున్న బదిలీ వేటుపై మౌనంగా ఉండకుండా ఓపెన్ అవుతున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లో రియాక్ట్ అవుతూ.. ‘‘మళ్లీ అదే జరిగింది. నిన్న రాజ్యాంగ దినోత్సవం జరిగింది. నేడు సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన జరిగింది.నిజాయితీకి అవమానమే బహుమానం’’ అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మోడీని వీరగా అభిమానించి.. ఆరాధించే వారు ఇలాంటి సిన్సియర్ అధికారులకు నమో హయాంలోనూ ఇలాంటి చేదు అనుభవాలే ఎందుకు ఎదురవుతున్నట్లు?