ఏపీ హోదా ఇవ్వం.. ట్రీట్ మెంట్ ఇస్తాం..

Update: 2019-01-19 10:45 GMT
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మరోసారి స్పష్టమైన వైఖరిని వెల్లడించింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అదే సమయంలో అంతకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కడపలో నిర్వహించిన సీమ 8 జిల్లాల పార్లమెంటు నియోజకవర్గాల శక్తి కేంద్రాల ప్రముఖ్ సమ్మేళన్ లో రాజ్ నాథ్ సింగ్ పాల్గొని మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని.. దురదృష్టం కొద్దీ సీఎం చంద్రబాబు సహకరించకుండా స్పెషల్ ట్రీట్ మెంట్ కేంద్రం ఇస్తోందని అంటున్నారని మండిపడ్డారు.

అందుకే ఇక ఏపీకి ప్రత్యేక కాదు స్పెష్టల్ ట్రీట్ మెంట్ ఇస్తామని హోంమంత్రి రాజ్ నాథ్ వెల్లడించారు. విభజన హామీల్లో 80శాతం ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. 20శాతం హామీలు అధికారంలోకి రాగా 2020కల్లా పూర్తి చేస్తామన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కేంద్రానికి సహకరించడం లేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ తో ఏ పార్టీ కలిసినా భూస్థాపితం అవుతుందని రాజ్ నాథ్ స్పష్టం చేశారు. పొత్తు ధర్మాన్ని పాటించే పార్టీ బీజేపీనేనన్నారు. పీవీ కూటమి ప్రభుత్వాలను నడిపిన ఘనతను సొంతం చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి పలు ప్రశంసలు కురిపించి తెలుగు జనాల మనసు చూరగొనే ప్రయత్నాలను రాజ్ నాథ్ చేశారు. పీవీ దేశానికి దిశానిర్ధేశం చేసినా కాంగ్రెస్ ఆయన్ను అవమానించిందని.. ఆయన పార్థీవదేహాన్ని కాంగ్రెస్ ఆఫీసుకు పంపించకుండా అవమానించిందని తెలిపారు.


Full View

Tags:    

Similar News