తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మరో హాట్ టాపిక్ అభ్యర్థులను కలవరపాటుకు గురిచేస్తోంది.శాసనసభ - పార్లమెంటు తరహాలోనే పంచాయతీ ఎన్నికల్లోనూ నోటా గుర్తును జతచేశారు. పోటీలో అభ్యర్థుల్లో ఎవరు నచ్చకుంటే ఎవరూ కాదు (నోటా)కు ఓటు వేసే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. నోటాను చేర్చడంతో బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. గ్రామ పంచాయతీ పోరులో ఈసారి బ్యాలెట్ పేపర్ లో నోటాను చేర్చడం ఖచ్చితంగా విజయ అవకాశాలను ప్రభావితం చేస్తుందని పలువురు ఆందోళన చెందుతున్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను చేర్చింది. ఈ ఆప్షన్‌ను సర్పంచ్ - వార్డు సభ్యులకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లలో ముద్రించనున్నారు. ఒక్కో బ్యాలెట్ లో పది గుర్తులతోపాటు నోటా గుర్తును పొందుపరుస్తున్నారు. బ్యాలెట్ పేపరుపై అభ్యర్థుల పేర్లు - గుర్తులు మాత్రమే ఉంటాయి. ఆ విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 10+1తో బ్యాలెట్లను ముద్రించింది. గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో పది మంది కంటే ఎక్కువగా పోటీ చేస్తే కొత్తగా బ్యాలెట్‌ను ముద్రిస్తారు.
కాగా, నోటాను బ్యాలెట్‌లో చేర్చడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే నోటాకు ఓటు వేయవచ్చు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నోటాకు ఓట్లు భారీగానే పడుతుండటంతో అభ్యర్థుల్లో దిగులు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలలో గుర్తుపక్కనే అభ్యర్థుల ఫొటో ఉండగా.. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్‌పై గుర్తులు మాత్రమే ఉంటాయి. వృద్ధులు, నిరక్షరాస్యులు నోటా కూడా ఓ అభ్యర్థి గుర్తు అనుకొని ఓటు వేసే ప్రమాదం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. అదే, పలువురు ఆశావహులను ఆందోళనకు గురిచేస్తోంది.