తెలంగాణలో మరో ప్రత్యేకత చేరనుంది. సార్వత్రిక ఎన్నికల కంటే ముందే స్థానిక సమరం తెలంగాణలో జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఏడాది జూలై 31తో ముగియనుంది. అంటే ఆగస్టులో పంచాయతీ పోరు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆగస్టు నెలలోనే మూడు విడుతల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సందర్భంగా కొత్త నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పత్రంలో ఈసారి కొత్త గుర్తు కనిపించనుంది. ఇప్పటివరకు అసెంబ్లీ - లోక్ సభ ఎన్నికల్లో ఈవీఎంలో వినియోగించిన నోటా ఆప్షన్ ను.. స్థానిక ఎన్నికల బ్యాలెట్ పేపర్లోనూ ముద్రించనున్నారు. ఇప్పటికే పలురాష్ర్టాల్లో స్థానిక ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో నోటా గుర్తును ముద్రించారని, తెలంగాణలోనూ ఈ విధానానికి అనుమతివ్వాలని గతేడాది కేంద్రఎన్నికల సంఘానికి రాసిన లేఖలో రాష్ట్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తిచేయగా...ఇందుకు సీఈసీ అనుమతించింది.
ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం మార్చి 24న ప్రకటించింది. దాని ఆధారంగా పంచాయతీలవారీగా - రిజర్వేషన్లవారీగా ఓటర్ల జాబితాను రూపొందించే ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారుచేసిన తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలచేయనున్నారు. ఎన్నికలను మూడువిడుతల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తేవడంతో గ్రామ పంచాయతీల సంఖ్య 12,751కు పెరిగింది. ఇందులో 100% ఎస్టీలున్న గ్రామాలు 1326 - ఏజెన్సీ గ్రామాలు 1311 - మిగిలిన మైదాన పంచాయతీలు10,114. వీటన్నింటిలో వార్డులు 1,13,270 ఉన్నాయి.
ఇదిలాఉండగా....పంచాయతీ ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్సులను సిద్ధంచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లక్ష బ్యాలెట్ బాక్సులున్నాయి. వీటిలో కొన్ని పనికిరావని గుర్తించారు. ప్రతీవార్డుకు ఒక బాక్సు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. దీనిలోనే వార్డుస్థానానికి - సర్పంచ్ కు ఓటు వేయాల్సి ఉంటుంది. కొన్ని బాక్సులను అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు రిజర్వులో ఉంచుతారు. ఈ నేపథ్యం లో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అదనంగా 15 వేల బ్యాలెట్‌బాక్స్ లు అవసరమవుతున్నాయి. వాటిని కర్ణాటక నుంచి తెప్పించుకునేందుకు ప్ర భుత్వం, సీఈసీ అనుమతి ఇచ్చాయి.