బ్రేకింగ్: రాంజెఠ్మలానీ కన్నుమూత

Update: 2019-09-08 05:21 GMT
ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది.. దేశంలో ఎన్నో సంచలన , సుధీర్ఘ కేసులను వాదించిన న్యాయవాది రాంజెఠ్మలానీ తుదిశ్వాస విడిచారు. 95 ఏళ్ల వయసులో ఆయన అనారోగ్యంతో ఇంట్లోనే కన్నుమూశారు. దేశంలోనే అత్యంత ఖరీదైన న్యాయవాదిగా ఈయనకు పేరుంది.

రాంజెఠ్మలానీ వాదిస్తే తిరుగుండదని.. ప్రత్యర్థి లాయర్లు చిత్తు కావాల్సిందేనన్నట్టుగా పేరుపొందారు. ఈయన వాదించిన 90 శాతం కేసులు విజయం సాధించడం విశేషం. ఏపీ సీఎం జగన్ సహా దేశంలోని ప్రముఖ నేతలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తల తరుఫున ఎన్నో కేసులు రాంజెఠ్మలానీ వాధించారు.

*రాంజెఠ్మలానీ బయోగ్రఫీ

1923, సెప్టెంబర్ 14న ముంబైలో జన్మించారు. 17 ఏళ్లకే లా పూర్తి చేశారు. అప్పట్లో పాకిస్తాన్ లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. దుర్గా జెఠ్మలానీని పెళ్లి చేసుకున్నారు. ఈయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. పాకిస్తాన్ దేశ విభజన తర్వాత ముంబై వచ్చారు. 2017 సెప్టెంబర్ 10న తన న్యాయవాద వృత్తికి రిటైర్ మెంట్ ప్రకటించారు. 90 ఏళ్ల వయసులో పార్వతి అనే మహిళను మరో పెళ్లి చేసుకోవడం విశేషం.

ఇక లాయర్ గానే కాదు.. రాజకీయ నేతగా కూడా రాంజెఠ్మలానీ రాణించారు. బీజేపీ నుంచి ఎంపీగా రెండు సార్లు ఎన్నికయ్యారు. వాజ్ పేయి హయాంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా చేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా కూడా పనిచేశారు. దేశంలో లాయర్ గా గంటకు ఇంత చొప్పున వసూలు చేయడం వివాదాలకు కారణమైంది. దేశంలో ఖరీదైన లాయర్ గా ఈయనతోనే అది ప్రారంభమవ్వడం విశేషం.
Tags:    

Similar News