ఫన్నీ కామెంట్స్ చేయడం తప్పేం కాదు

Update: 2021-12-26 23:30 GMT
భావ వ్యక్తీకరణకు సంబంధించి మద్రాస్ హైకోర్టు ఓ కీలక తీర్పు ఇచ్చింది. మనిషికి ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఆనందంగా ఉండేందుకు హక్కు ఉందని స్పష్టం చేసింది. ఇతరుల మనోభావాలు దెబ్బ తీయకుండా వారు వ్యక్తిగతంగా ఫన్నీ గా ఉండేందుకు హక్కు ఉందని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. కీలకమైన కేసుకు సంబంధించి న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది. సోషల్ మీడియాలో వెల్లువెత్తే కామెంటులో హాస్యాస్పదంగా ఉండే వాటికి కొంత మంది ఫీల్ అవుతుంటారు. మరికొందరు ఆ కామెంట్లను ఎంజాయ్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఫన్నీ గా కామెంట్ చేసేందుకు మనిషికి హక్కు ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఈ మేరకు మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) లో ఎంజాయ్ చేసే హక్కు కూడా భాగమని పేర్కొంది. ఇందుకు ఉదాహరణగా కోర్టు ఒక అంశాన్ని తీసుకుని వివరించింది. కార్టూనిస్టు లేదా వెంగ్య రచయిత తన భావాన్ని వ్యక్తీకరించడానికి రాసిన రాతలు కానీ వేసిన బొమ్మలను కానీ తప్పు అర్ధం తో చూడలేమని స్పష్టం చేసింది. ఇవి కేవలం ఇతరులను నవ్వించడానికి మాత్రమే ఉపయోగించిన అంశాలుగా భావించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది.

ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాలను ఉపయోగించడం విరివిగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఎవరైనా పెట్టిన పోస్ట్ కు కొంతమంది హాస్యాస్పదంగా కామెంట్ రూపంలో స్పందిస్తుంటారు. మరికొందరు వాటిని ఖండిస్తూ ఉంటారు. ఇలా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన అన్ని పోస్టులకు హర్ట్ అయిన చాలా మంది పోలీసులకు కూడా కంప్లైంట్ చేస్తుంటారు. అయితే ఇలా నమోదైన ఓ కంప్లైంట్ చిలికి చిలికి గాలివానగా మారింది. చివరకు న్యాయస్థానం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఫన్నీ గా ఉండే హక్కు పౌరులకు ఉందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి నమోదయిన కంప్లైంట్ కొట్టివేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఫన్నీ గా ఉండే హక్కు భావవ్యక్తీకరణకు సంబంధించిందని తీర్పులో పేర్కొంది.

తమిళనాడుకు చెందిన కమ్యూనిస్టు పార్టీ నేత ఒకరు తన ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ ఆధారంగా అక్కడి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అతను ఓ ప్రాంతానికి వెళుతూ దిగిన ఫోటోలు ఫేస్బుక్లో పెట్టారు. వాటికి క్యాప్షన్ గా షూటింగ్ ప్రాక్టీస్ ఎట్ సిరుమలై అని ఉంచారు. ఆ క్యాప్షన్ పై అభ్యంతరం వ్యక్తం చేసినా తమిళనాడు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. నమోదు చేసిన కేసులు పోలీసులు పేర్కొన్న అంశాలు ఏవంటే నేరపూరితమైన కుట్ర, దేశ సమగ్రతను దెబ్బ తీయడం. అయితే పోలీసులు నమోదు చేసిన కేసు పై కమ్యూనిస్టు పార్టీ నేత హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం దానిని ఒక ఫన్నీ పోస్ట్ గా చూడాలని చెప్పింది. నమోదైన కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.


Tags:    

Similar News