రాజు కంటే రాజు సేవకుడు మరింత పవర్ ఫుల్ అని అంటే.. ఏమో అనుకుంటాం కానీ.. అదేంటన్న విషయం తాజాగా అందరికి అర్థమయ్యేలా చేసే ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. ఓటుకు నోటు వ్యవహారంలో గత కొద్దిరోజులుగా స్తబ్దుగా ఉన్న వాతావరణానికి భిన్నంగా బుధవారం చోటు చేసుకున్న పరిణామాలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ముడుపులు ఇచ్చేందుకు ఇచ్చిన అడ్వాన్స్ కు సంబంధించిన సమాచారం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డికి తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు రెఢీ అయ్యారు. వారు లోకేశ్ డ్రైవర్ కోసం పలు విధాలుగా ప్రయత్నించారు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో.. అతని ఇంటి దగ్గర నోటీసులు అంటించి.. ఎట్టి పరిస్థితుల్లో గురువారం(ఆగస్టు 13) తమ ముందుకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
ఇది జరిగిన కాసేపటికే.. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ డ్రైవర్.. గన్ మ్యాన్లకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఓటుకు నోటు కేసులో నిందితుడైన మత్తయ్య.. ఏపీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేటీఆర్ గన్ మెన్.. కారు డ్రైవర్ ఇద్దరికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించి.. నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అంతేకాదు.. 2013లో విశాఖ జిల్లా పెందుర్తిలో నమోదైన హత్యాయత్నం కేసులో కేటీఆర్ ముఖ్యఅనుచరుల్లో ఒకరైన సతీష్ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.
మరోవైపు.. కేటీఆర్ డ్రైవర్..గన్ మెన్లకు నోటీసులు ఇచ్చేందుకు విజయవాడ నుంచి సీఐడీ బృందం రెండు వాహనాల్లో సీఎం కేసీఆర్ క్యాంపు ఆపీసు వద్దకు చేరుకున్నారు. వీరి రాక గురించి తెలుసుకున్న పోలీసులు భద్రతను మరింత పెంచి.. వాహనాన్ని ముందే ఆపేశారు. తాము వచ్చిన పని గురించి చెప్పగా.. కారు డ్రైవర్.. గన్ మెన్లు లేరని బదిలిచ్చారు. దీంతో.. సీఐడీ అధికారులు కేటీఆర్ నివాసమైన నందినగర్ వద్దకు వెళ్లారు. అక్కడ కూడా వారు లేరని చెప్పటంతో గురువారం వారికి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
మొత్తంగా చూస్తే.. నేతలకంటే కూడా.. అధినేతల కుమారుల డ్రైవర్లు.. గన్ మెన్లు ఎంత పవర్ ఫుల్ అన్న విషయం తాజా ఉదంతంతో స్పష్టమైందన్న భావన వ్యక్తమవుతోంది. ఇరువురి సిబ్బందికి నోటీసులు ఇవ్వటం అంత తేలిక కాదని.. వారి ఆచూకీ తెలుసుకోవటం కోసం అధికారులకు కష్టంగా ఉండటం గమనార్హం. తాజా నోటీసుల కలకలం.. ఎక్కడి వరకు వెళుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.