వైసీపీ రెబల్ ఎంపీ.. కనుమూరి రఘురామకృష్ణం రాజుకు సీఐడీ పోలీసులు.. మరోసారి నోటీసులు జారీ చేయడం.. గమనార్హం. సీఐడీ డీఎస్పీ ఆర్.జి. జయసూర్య పేరుతో విడుదల చేసిన ఈ నోటీసుల్లో.. రఘురామను మూడురోజుల పాటు నిత్యం విచారించనున్నట్టు పేర్కొన్నారు. సోమవారం నుంచి వరుసగా.. మంగళవారం.. బుధవారం కూడా విచారించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ లోని దిల్‌కుషా అతిథి భవన్‌లో ఈ విచారణ సాగనున్నట్టు తెలిపారు.
క్రైమ్ నెంబరు 12, 2021, ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి.. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ విచారణ జరుగుతుందని తెలిపారు. కాగా, రఘురామపై.. 153(ఏ), 505 రెడ్ విత్, 120(బి) సెక్షన్ల కింద కేసులు నమోదైనట్టు ప్రకటనలో వివరించారు. అయితే.. ఈ నోటీసులను గత నెలలోనే పంపినట్టుగా.. ఉండడం.. గమనార్హం. అయితే.. ఈ నోటీసులకు రఘురామ కూడా ఆసక్తిగా రియాక్ట్ అయ్యారు.
హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. తనను విచారించాలని.. పేర్కొన్న మాట వాస్తవమేనని..అయితే.. ఇదే కేసులో మరి ఇద్దరు నిందితులతో కూడా కలిపి విచారించాలని.. హైకోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. అంతేకాదు.. ఆఇద్దరు నిందితులను కూడా..
అదే రోజుల్లో విచారించాలని.. ఒకే స్థలంలో విచారించాలని.. కూడా హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని రఘురామ సీఐడీ డిప్యూటీ ఎస్పీకి లేఖ రాశారు. ఈ విషయంలో కోర్టు విధించిన నియమ నిబంధనలను పోలీసులు అతిక్రమిస్తే.. హైకోర్టును ఆశ్రయించే వెసులుబాటు ఉందన్నారు.
ఈ క్రమంలో సదరు ఇద్దరు నిందితులను వేరే వేరే ప్రాంతాల్లో విచారించేందుకు సీఐడీ పోలీసులు రెడీ అయ్యారన్న సమాచారం తనకు ఉందని.. అదేసమయంలో వారిని ఎక్కడ ఎందుకు విచారిస్తున్నారో.. కూడా స్పష్టత లేదని.. ఆయన తెలిపారు.
ఈ క్రమంలో కేసు విషయంలో పోలీసులు.. పారదర్శకంగా వ్యవహరించడం లేదనే విషయం రుజువు అవుతోందని పేర్కొన్నారు. దీంతో తాను.. ఈ విచారణకు హాజరు కావడం లేదని.. హైకోర్టులో పిటిషన్ వేసినందున.. దానిపై వచ్చే వారం విచారణ జరగనున్నందున.. తర్వాత.. చూసుకుందాం.. అని ఆయన సీఐడీకి సమాధానం ఇచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.