మ‌రో ఎన్నిక‌కు నోటిఫికేష‌న్.. గులాబీ గూటికే ఆ పోస్టు

Update: 2019-05-15 09:36 GMT
ఏ క్ష‌ణంలో కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు నిర్ణ‌యం తీసుకున్నారో కానీ.. నాటి నుంచి నేటి వ‌ర‌కూ వ‌రుస పెట్టి.. బ్యాక్ టు బ్యాక్ అన్న‌ట్లుగా ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. తాజాగా మ‌రో ఎన్నిక‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ జారీ అయ్యింది. అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత పంచాయితీ ఎన్నిక‌లు.. ఆ త‌ర్వాత ఎంపీ ఎన్నిక‌లు.. ఆ పోలింగ్ పూర్తి అయిన వెంట‌నే జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇది కాకుండా.. స్థానిక సంస్థ‌ల ద్వారా ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నిక ఒక‌టి రాగా.. తాజాగా ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నిక‌కు ఈసీ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇంత‌కీ ఈ ఎన్నిక‌ల ఎందుకు వ‌చ్చిందంటారా?

ముంద‌స్తు ఎన్నిక‌ల్లో మ‌ల్కాజిగిరి అసెంబ్లీ స్థానానికి టీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు పోటీ చేసి గెలిచిన నేప‌థ్యంలో త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. 2017లో ఆయ‌న మండ‌లికి ఎన్నిక‌య్యారు. ఈ స్థానం ఖాళీ కావ‌టంతో దాన్ని భ‌ర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేష‌న్ జారీ చేశారు.

ఈ ఎన్నిక‌ల‌కు మే 21న నోటిఫికేష‌న్ విడుద‌ల కాగా.. నామినేష‌న్ల స్వీక‌ర‌ణ అదే రోజు ప్రారంభ‌మై.. 28 వ‌ర‌కు ఉంటుంది. 29న ప‌రిశీల‌న‌.. 31న నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు ముగుస్తుంది. జూన్ 7న ఉద‌యం 7 గంట‌ల‌కు మొద‌ల‌య్యే ఎన్నిక సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు సాగుతుంది. సాయంత్రం 5 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈ స్థానాన్ని టీఆర్ ఎస్ గెలుచుకోవ‌టానికి నూటికి నూరుశాతం అవ‌కాశం ఉంది.


Tags:    

Similar News